Share News

రాజీవ్‌ స్వగృహాలకు మోక్షమెప్పుడో?

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:49 PM

సాధారణంగా ప్రతి ఒక్కరికీ కూడు, గుడ్డ, నీడ అనేది కచ్చితంగా ఉండాల్సిన కనీస అవసరం. అయితే దీనిని ఎంచుకునే మార్గాలు మాత్రం వారి స్థితిగతులు, జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అరకొర ఉపాధి అవకాశాలతో బతుకు బండి లాగేవాళ్లకు కనీసం గంజి నీళ్లు, సొంత చిన్న ఇల్లు జీవితంలో కలగానే మిగులుతుంది. ఈక్రమంలో 2008లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాన్యులకు సొంతిల్లును అందిస్తామని, ఇంటి నిర్మాణాలు చేసి ఆక్షన్‌ల ద్వారా ఇల్లు అందిస్తామని ప్రకటించింది.

రాజీవ్‌ స్వగృహాలకు మోక్షమెప్పుడో?

సామాన్యులకు సొంతింటిని అందించేందుకు

2008లో నిర్మాణాలు ప్రారంభం

50 ఎకరాల్లో 598 ఇళ్లకు శ్రీకారం

ఎన్నో అవాంతరాలతో అప్పుడప్పుడూ నిర్మాణాలు

402 ప్లాట్లకు కలగని మోక్షం, 176 ప్లాట్ల విక్రయాలు

వేటపాలెం (చీరాల), మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : సాధారణంగా ప్రతి ఒక్కరికీ కూడు, గుడ్డ, నీడ అనేది కచ్చితంగా ఉండాల్సిన కనీస అవసరం. అయితే దీనిని ఎంచుకునే మార్గాలు మాత్రం వారి స్థితిగతులు, జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అరకొర ఉపాధి అవకాశాలతో బతుకు బండి లాగేవాళ్లకు కనీసం గంజి నీళ్లు, సొంత చిన్న ఇల్లు జీవితంలో కలగానే మిగులుతుంది. ఈక్రమంలో 2008లో కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాన్యులకు సొంతిల్లును అందిస్తామని, ఇంటి నిర్మాణాలు చేసి ఆక్షన్‌ల ద్వారా ఇల్లు అందిస్తామని ప్రకటించింది. అయితే దీంతో చిగురించిన ఆశలు, రెట్టించిన ఉత్సాహంతో అప్పట్లో ఆక్షన్‌లో పాల్గొనేందుకు మీ-సేవల ద్వారా నామమాత్రపు చెల్లింపును ప్రవేశ పెట్టడంతో అప్పట్లో చీరాల పరిఽధిలో సుమారు 15 రోజుల పాటు సామాన్య ప్రజలు బారులు తీరారు. పెద్ద ఎత్తున అర్జీలను అందజేశారు.

అనుకున్నది ఒక్కటి.. అయినది మరొక్కటి

అయితే అప్పట్లో ప్రజలు చీరాల పట్టణానికి సమీపం లేదా ప్రజల నివాసాల మధ్య ఇళ్లు ఏర్పాటు జరుతాయని ఆశాభావంతో అర్జీలకు పోటీ పడ్డారు. కానీ తీరా గృహ నిర్మాణాలు వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం వద్ద జరగడంతో నిరాశతో చాలామంది ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించిన నగదును వెనక్కి తీసుకున్నారు. ఈక్రమంలోనే అధికారులు నిర్దేసించిన స్థలంపై అనుకూలత లేని ప్రజ ల్లో చాలా మంది గృహా ల ఆక్షన్‌లకు కూడా దూరంగా ఉ న్నారు. దీంతో అప్పట్లోనే నిర్మాణాలపై ప్రజల్లో భిన్న స్వరాలు వినిపించాయి.

నిర్మాణాలు..ఆక్షన్‌లు ఇలా

అయితే తలపెట్టిన లక్ష్యంతో అధికారులు చల్లారెడ్డి పాలెం పంచాయితిలో సుమారు 50ఎకరాల విస్తీర్ణంలో వివిధ దశల్లో 598 ప్లాట్లు సుమారు రూ.16కోట్ల వ్యయంతో నిర్మాణాలు ప్రారంభించారు. అయితే ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. నిర్దేసించిన స్థలంలో సుమారు ఎకరన్నర భూమి కోర్టు పరిధిలోకి చేరింది. అప్పటి నుంచే ప్రారంమైన వివిధ సమస్యల కారణంగా నిర్మాణాలు ఏళ్ల తరబడి నత్తననడకన సాగుతున్నాయి. కొన్ని ప్లాస్టింగ్‌, పెయింటింగ్‌ వరకు పూర్తి చేయగా, మరి కొన్ని బేస్‌మట్టంలోనే ఆగిపోయాయి. అయితే 2018లో అప్పటి ప్రభుత్వం జీవె నెంబర్‌ 243 విడుదల చేసి ఆక్షన్‌లు నిర్వహించాలని ఆదేసించింది. దీంతో ఇప్పటిక నిర్వహించిన మూడు పాటల్లో 176 వరకు అమ్మకాలు జరగ్గా, 400కి పైగా పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తానికి ధర అధికం, స్థలం సుదూరం కావడంతో ప్రజలు వీటికి దూ రంగా ఉంటున్నారు. దీంతో నిర్మాణాలు సాగక లక్ష్యం నీరుగారుతోంది. టీడీపీ కూటమి అయినా దృష్టి సారించి శిథిలమవుతున్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ ఆస్తులను కాపాడడంతోపాటు వాటిని పేదలకు అప్పగించి సొంతింటి కలను నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

అంతర్గత రహదారులు నిర్మాణాలు చేస్తున్నాం

ఇటీవల మంజూరయిన రూ.3.52 కోట్లుతో అంతర్గత రహదారులు, నిర్మాణాలు చేస్తున్నాము. గతంలో జరిగిన ఆక్షన్‌ల కారణంగా సుమారు రూ.6 కోట్లు రెవెన్యూ వచ్చింది. మరో రెండు, మూడు నెలల్లో ఆక్షన్‌లు జరుగుతాయి. నిర్మాణాలు పటిష్టంగా, పారదర్శకంగా ఉన్నాయి. గృహాలు ప్రజాదరణ పొందుతాయి.

- కోటేశ్వరరావు, రాజీవ్‌ స్వగృహ అసిస్టెంట్‌ మేనేజర్‌

Updated Date - Mar 20 , 2025 | 11:49 PM