అద్దంకి ఏఎంసీ చైర్‌పర్సన్‌గా పద్మావతి
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:59 PM
అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా వరగాని పద్మావతిని ప్రభుత్వం ప్రకటించింది. అద్దంకి ఏఎంసీ చైర్‌పర్సన్ ఎస్సీ మహిళకు కేటాయించడం తో కొరిశపాడు మండలం పి.గుడిపాడుకు చెందిన టీడీపీ సీనియర్ నేత మందా నాగేశ్వరరావు కుమా ర్తె, వరగాని ప్రసన్నకుమార్ సతీమణి పద్మావతిని నియమించారు. వైస్ చైర్మన్‌గా అద్దంకి పట్టణానికి చెందిన కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతకు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్‌ల జాబితా శనివారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

వైస్ చైర్మన్‌గా కాపు సామాజికవర్గానికి కేటాయించే అవకాశం
వరుసగా మూడోసారి కూడా మహిళకే
అద్దంకి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : అద్దంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా వరగాని పద్మావతిని ప్రభుత్వం ప్రకటించింది. అద్దంకి ఏఎంసీ చైర్‌పర్సన్ ఎస్సీ మహిళకు కేటాయించడం తో కొరిశపాడు మండలం పి.గుడిపాడుకు చెందిన టీడీపీ సీనియర్ నేత మందా నాగేశ్వరరావు కుమా ర్తె, వరగాని ప్రసన్నకుమార్ సతీమణి పద్మావతిని నియమించారు. వైస్ చైర్మన్‌గా అద్దంకి పట్టణానికి చెందిన కాపు సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేతకు కేటాయించనున్నట్లు తెలుస్తుంది. డైరెక్టర్‌ల జాబితా శనివారం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అద్దంకి ఎఎంసీ పరిధిలో అద్దంకి, కొరిశపాడు, పంగులూరు మండలాలు ఉన్నాయి. డైరెక్టర్ ల కేటాయింపులో అన్ని సామాజిక వర్గాలను, అన్ని మండలాలకు ప్రాధాన్యం ఉండేలా జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ప్రసన్నకుమార్, పద్మావతి కుటుంబం వ్యవసాయమే ప్రధాన జీవనం కావడం తో పాటు కూరగాయాల సాగు ఎక్కువగా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అద్దంకి, మేదరమెట్లలో గత దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న అన్నగారి సంతకు మరలా పూర్వ వైభవం వస్తుందనే ఆశను రైతులు వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్ లు ప్రారంభించిన తరువాత వరుసగా మూడో సారి కూడా మహిళకే దక్కింది. గత వైసీపీ హయాంలో తొలుత బీసీ మహిళకు కేటాయించగా పంగులూరు మండలం అలవలపాడుకు చెందిన భువనేశ్వరికి దక్కింది. రెండోసారి ఎస్సీ మహిళకు కేటాయించడం తో కొరిశపాడు మండలం మేదరమెట్లకు చెందిన జజ్జర ఈశ్వరమ్మకు దక్కింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఎస్సీ మహిళకే దక్కింది. దీంతో వరుసగా మూడు సార్లు మహిళలు అద్దంకి ఏఎంసీ చైర్‌పర్సన్‌లు అయ్యారు.
రైతులకు మేలు జరిగేలా కృషి
విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమ కుటుంబంపై నమ్మకంతో అప్పగించిన పదవికి న్యాయం చేస్తాను. రైతులకు మేలు జరిగేలా కృషి చేస్తాను. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అద్దంకి, మేదరమెట్లలో ప్రారంభించిన అన్నగారి సంతకు పూర్వ వైభవం వచ్చే విధంగా కృషి చేస్తాను.
- వరగాని పద్మావతి
అద్దంకి ఏఎంసీ చైర్‌పర్సన్