ఇరువురు న్యాయాధికారుల బదిలీ
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:28 PM
జిల్లా న్యాయస్థానంలో పనిచేస్తున్న ఇరువురు న్యాయాధికారులు బదిలీ అయ్యారు. ఆమేరకు సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

వారిస్థానంలో కొత్తవారు నియామకం
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయస్థానంలో పనిచేస్తున్న ఇరువురు న్యాయాధికారులు బదిలీ అయ్యారు. ఆమేరకు సోమవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి అదనపు న్యాయాధికారిగా ఇక్కడ పనిచేస్తున్న డి.అమ్మనరాజాను నంద్యాలకు బదిలీ చేశారు. ఆ స్థానంలో అనంతపురంలో పనిచేస్తున్న టి.రాజ్యలక్ష్మిని నియమించారు. మూడో అదనపు న్యాయాధికారిగా ఇక్కడ పనిచేస్తున్న డి.రాములును గుంటూరు ఇండస్ట్రియల్ ట్రైబల్ కం ప్రిసైడింగ్ ఆఫీసర్, లేబర్ కోర్టుకు బదిలీ చేవారు. ఆయన స్థానంలో మచిలీపట్నం జిల్లా కోర్టులో న్యాయాధికారిగా పనిచేస్తున్న ఎ.పూర్ణిమను నియమించారు.