Share News

నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:19 AM

నియోజకవర్గంలో విద్యా రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎం ఎం కొండయ్య అన్నారు. బుధవారం సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరిగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో బీటెక్‌ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సభ సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.

నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషి
విద్యార్థినులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొండయ్య

ఎమ్మెల్యే కొండయ్య

చీరాల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గంలో విద్యా రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎం ఎం కొండయ్య అన్నారు. బుధవారం సెయింట్‌ ఆన్స్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరిగ్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలలో బీటెక్‌ ఆఖరి సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సభ సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈసందర్భం గా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరో అతిథిగా టెక్‌ మహీంద్ర కంపెనీ ప్రతినిధి వెంకట గోపీచంద్‌ హాజరయ్యారు. కళాశాల సి బ్బంది, విద్యార్థులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విద్యార్థి దశ నుంచి ఆచరించాల్సిన లక్షణాలను, లక్ష్యాలను వివరించారు. ప్రజా వ్యవస్థకు వి ద్యార్థులు మూలమన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డా. జగదీష్‌, బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:19 AM