Share News

ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలి

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:35 AM

నీటిని వృథా చేయకుండా సంరక్షించుకుంటూ ప్రతి బొట్టూ భూమిలో ఇంకే విధంగా ఒడిసి పట్టుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు.

 ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలి

మంత్రి బాలవీరాంజనేయస్వామి

కలెక్టర్‌ అన్సారియాతో కలిసి కనుమళ్లలో నీటికుంటకు భూమిపూజ

సింగరాయకొండ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): నీటిని వృథా చేయకుండా సంరక్షించుకుంటూ ప్రతి బొట్టూ భూమిలో ఇంకే విధంగా ఒడిసి పట్టుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచించారు. శనివా రం మండలంలోని కనుమళ్ల గ్రామంలో నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న సేద్యపు నీటికుంటకు కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ప్ర జలతో నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సిం గరాయకొండ బాలయోగినగర్‌లో రూ.2.30లక్షలతో నిర్మించిన ఫారంఫాండ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఒంగోలు డ్వా మా కార్యాలయంలో నీటి సమస్యలు పరిష్కరించేందుకు జల శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. నీటిని సం రక్షిం చుకొనేందుకు నీటికుంట నిర్మాణాలకు చేపట్టాలని పిలుపుని చ్చారు. నీరు ఉంటేనే జీవకోటికి మనుగడ సాధ్యమని ప్రజలు గుర్తించి సంరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో నీరు-చెట్టు కార్యక్ర మం ద్వారా నీటి సంరక్షణకు చర్యలు చేపట్టామని గుర్తు చేశా రు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ కా ర్యక్రమాన్ని నిలిపివేసిందన్నారు. ప్రతి రైతు తమ పొలాల్లో కుంటలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎంతమంది రైతులు ముందుకొచ్చినా మంజూరు చేస్తామన్నారు. కలెక్టర్‌ త మీమ్‌ అన్సారియా మాట్లాడుతూ నీటి సంరక్షణ చర్యల్లో భా గంగా వచ్చే 3,4 నెలల్లో 30 వేల ఇంకుడు గుంతలు, 9,500 నీ టికుంటల నిర్మాణాలు చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తె లిపారు. కార్యక్రమంలో డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ లక్ష్మానాయక్‌, తహసీల్దార్‌ రవి, ఎంపీడీవో జయ మణి, పలుశాఖల అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:35 AM