ప్రజల భాగస్వామ్యంతో కేంద్రాలను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:40 PM
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ప్రజల భాగస్వామ్యంతో ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు.

పామూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ప్రజల భాగస్వామ్యంతో ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చెప్పారు. స్థానిక చెత్త నుంచి తయారీ కేంద్రంలో జరుగుతున్న ఎల్‌టీసీ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెత్త సంపద కేంద్రంలో ఉన్న మహత్మగాంఽధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేంద్రంలోని నాడెప్ తొట్లను, వానపాములతో తయారైతున్న ఎరువులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీవో హనుమంతరావు, ఎంపీడీవో బ్రహ్మయ్య, ఈవోఆర్డీ అరవిందరెడ్డి, డీపీఆర్పీ రాఘవులు, టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు పువ్వాడి వెంకటేశ్వర్లు, షేక్ ఖాజారహంతుల్లా ఎంపీటీసీ సభ్యులు ఆకుపాటి వెంకటేష్, ఉప్పలపాటి హరిబాబు, పిడుగు శ్రీనివాసులు, సయ్యద్ అమీర్‌బాబు, పందిటి హరీష్ పాల్గొన్నారు.