Share News

పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:33 AM

పట్టణాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేం దుకు ప్రత్యేకశ్రద్ధతో పక్కా ప్రణాళికలు రూ పొందిస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి పేర్కొన్నారు.

పట్టణాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ

గిద్దలూరుటౌన్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): పట్టణాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసేం దుకు ప్రత్యేకశ్రద్ధతో పక్కా ప్రణాళికలు రూ పొందిస్తున్నట్లు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పీఆర్‌ కాలనీ లోని సత్యనారాయణస్వామి కళ్యాణ మండ పం ప్రాంతానికి చెందిన పలువురు నాయ కులు పార్టీ శ్రేణులు ఆయన్ను సన్మానిం చారు. ఈ సందర్భంగా ముండ్లపాడులోని శ్మశానవాటికను అభివృద్ధి చేసి రక్షణ గోడ నిర్మించాలని, అలాగే సగి లేరువాగు ముంపు ప్రాంతా లలో రక్షణగోడ ఏర్పాటు చేయా లని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకె ళ్లారు. దీనిపై ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి స్పందించారు. ఆయా అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషిచేస్తానన్నారు. నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేయడమే తన బాధ్యత అన్నారు. ఇచ్చిన హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీసర్పంచ్‌ దప్పిలి విజయ భాస్కర్‌రెడ్డి, నాయకులు కాశిరంగారెడ్డి, బోయిళ్ళపల్లి కిశోర్‌, బత్తుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 12:33 AM