Share News

శభాష్‌ పోలీస్‌

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:54 PM

మానవ సేవే మాధవ సేవ అని పోలీసులు నిరూపించారు. నిత్యం విధులలో బిజీగా ఉండే పోలీసులు మేముసైతం అన్నట్లు సామాజక స్పృహను గుర్తెరిగారు. ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఓ వృద్ధుడు నిస్సహాయస్థితిలో పడి ఉన్నాడు.

శభాష్‌ పోలీస్‌

నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధుడికి సపర్యలు

ఒంగోలు క్రైం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): మానవ సేవే మాధవ సేవ అని పోలీసులు నిరూపించారు. నిత్యం విధులలో బిజీగా ఉండే పోలీసులు మేముసైతం అన్నట్లు సామాజక స్పృహను గుర్తెరిగారు. ఎస్పీ కార్యాలయం ఎదురుగా ఓ వృద్ధుడు నిస్సహాయస్థితిలో పడి ఉన్నాడు. అతడి పరిస్థితిని చూసి చలించిపోయిన హెడ్‌ కానిస్టేబుల్‌ అక్బర్‌సాహెబ్‌, కానిస్టేబుల్‌ యోగినారాయణ, మహిళా హోంగార్డు ఝాన్సీలు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆ ముగ్గురు కలిసి వృద్ధుడికి సపర్యలు చేశారు. స్వయంగా స్నానం చేయించి దుస్తులు వేసి, టిఫిన్‌ పెట్టించారు. ఆ తర్వాత ఆరా తీయగా ఆ వృద్ధుడు.. తనది పమిడిపాడు అని, పేరు వెంకటేశ్వరరెడ్డి అని చెప్పాడు. అయితే అతనిని వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులు మోటార్‌ బైక్‌పై తీసుకొచ్చి అక్కడ వదిలేశారని స్థానికులు చెబుతున్నారు. వృద్ధుడి పట్ల మానవత్వం ప్రదర్శించిన పోలీసులను చూసి శభాష్‌ అంటూ పలువురు అభినందించారు.

Updated Date - Mar 23 , 2025 | 11:54 PM