ఘనంగా ఉగాది వేడుకలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 10:28 PM
నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఉగా ది పర్వదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చీరాల, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గం పరిధిలో ఆదివారం ఉగా ది పర్వదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ రుణ సాయంతో అభివృద్ధి
ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రుణ సాయంతో అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. పీఎంఎ్‌ఫఎంఈ ద్వారా మంజూరైన రూ.13లక్షల చెక్కులను రుణ గ్రహీతలకు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఈపథకం ద్వారా ఉపాధి కోసం రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు బ్యాంకులు సాయం అందిస్తున్నట్లు వివరించారు. అ వకాశాలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎంలు మధు, అంజిబాబు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.
అద్దంకి : తెలుగు సంవత్సరాది ఉగాది ని ఆదివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నా రు. ఇళ్లల్లో ప్రత్యేక పూజలు చేసుకొని దేవాలయాలకు వెళ్లి స్వామి వార్లను దర్శించుకున్నారు. శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి, లక్ష్మీనరసింహస్వామి దే వాలయాలలో ప్రత్యేకంగా అలంకరించా రు. ఆలయాల్లో విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం విన్పించారు. ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో చీరాల ప్రిన్సిపల్ జూనియర్ న్యాయాధికారి రిహానా కుటుంబసభ్యులతో పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా డ్వామా పీడీ జోసఫ్ కుమార్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వార్లను దర్శించుకున్నారు. జానపద కళాపీఠం ఆధ్వర్యంలో జనశిక్షణ సంస్థ డైరెక్టర్ శ్యాంసునీల్‌కు ఉ గాది పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఆర్జేడీ డాక్టర్ దేవపాలన, జ్యోతిచం ద్రమౌళి పాల్గొన్నారు.
చినగంజాం : తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను అన్ని గ్రామాల్లో ఆదివారం ఘనం గా నిర్వహించారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. షడ్రుచుల సమ్మేళిత ఉగాది పచ్చడిని భక్తులకు పంపిణీ చేశారు. పంచాగ శ్రవణాన్ని వేద పండితులు చదవి వినిపించారు. ఒకరినొకరు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భూ సమేత భావనారాయణస్వామి ఆలయంలో ఉగాది పండుగను పురస్కరించుకుని అలయ అర్చకులు ఏఎల్ లక్ష్మీనరసింహాచార్యులు, యాక్నిక స్వాములు పరాశరం రామాచార్యుల ఆధ్వర్యంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు శత అష్టోత్తర కలశ స్థాపన తిరువంజనం కార్యక్రమాన్ని నిర్వహించి, 108 కలిశాలతో స్వామికి అభిషేకాలు, విశేష పూజలు జరిపారు. రాత్రికి స్వామి వారిని విశేషంగా అలంకరించి ఊంజల్ సేవ జరిపారు. తదనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను వినియోగం చేశారు. మండలంలోని సంతరావూరు, చినగం జాం, గొనసపూడి, కడవకుదురు, రాజుబంగారుపాలెం, చింతగుంపల్లి, పెదగంజాం, నీలాయిపాలెం తదితర గ్రామాల్లోని దేవాలయాల్లో పంచాగ శ్రవణం ని ర్వహించారు.
పర్చూరు : ఉగాది పండుగను ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ తివిక్రమ అగస్తేశ్వరస్వామి ఆలయంలో శ్రీకంచి బొట్ల శ్రీనివాసశర్మ నేతృత్వంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి నాగయ్య ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రం జరిగింది.
మార్టూరు : ఉగాది పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇళ్లకు మామిడితోరణాలు కట్టుకొని, పూజలు చేశారు. ఘట్టేశ్వరస్వామి, పాండురంగస్వామి, ఆంజనేయస్వామి తదితర దేవస్థానాలకు వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.
ఆకట్టుకున్న మాచిరాజు పంచాంగ శ్రవణం
పంగులూరు : చందలూరు గ్రామంలో ఆదివారం ఉగాది పర్వదిన సందర్భంగా పంచాగ శ్రవణం జరిగింది. గ్రామంలోని శ్రీ చెన్నకేశవస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్రముఖ వేదపండితులు మాచిరాజు వేణుగోపాల్ పంచాంగ శ్రవణం గావించారు. పంచాంగ శ్రవణం భవిష్యత్ ద్వారాన్ని ఆవిష్కరిస్తుందని, విశ్వావసు సంవత్సరంలో గతం కంటే అందరికీ మెరుగైన ఫలితాలు ఉంటాయని మాచి రాజు తెలిపారు. మీన రాశి వారికి కొంత ఇబ్బందికరం ఉంటుందన్నారు. గతం కంటే పంటలు ఆశాజనకంగా ఉంటాయని, దిగుబడులు, ధరలు అనుకూలిస్తాయన్నారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ మాజీ చైర్మన్ పల్లపోతు శ్యాంసుందరం, ఈవో అంజనీదేవి, అర్చకులు రఘునాథాచార్యులు, గ్రామపెద్దలు, రైతు లు పాల్గొన్నారు.