Share News

బీసీ కార్పొరేషన్‌ రుణాలకు 19,616 దరఖాస్తులు

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:09 AM

బీసీ కార్పొరేషన్‌ రుణాలకు జిల్లా వ్యాప్తంగా 19,616 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసు కున్నారు.

బీసీ కార్పొరేషన్‌ రుణాలకు 19,616 దరఖాస్తులు
గంట్యాడలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న దృశ్యం

  • జిల్లా వ్యాప్తంగా 3,379 యూనిట్ల లక్ష్యం

  • ఆన్‌లైన్‌ నమోదుకు తక్కువ సమయం

  • అధిక శాతం అభ్యర్థులు దూరం

విజయనగరం కలెక్టరేట్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): బీసీ కార్పొరేషన్‌ రుణాలకు జిల్లా వ్యాప్తంగా 19,616 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసు కున్నారు. వీరికి మండల, మున్సిపల్‌ పరిధిలో శుక్రవారం నుంచి ఇంట ర్వ్యూ ప్రక్రియ మొదలు పెట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధి లో మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నా రు. ఎంపిక చేసిన అభ్యర్థులను వివరాలను ఎంపీడీఓ, కమిషనర్ల లాగి న్‌ నుంచి సంబంధిత బ్యాంకు మేనేజర్ల లాగిన్‌లోకి పంపిస్తారు. ఇదిలా ఉండగా.. బీసీ, మైనార్టీ, కాపు, వైశ్య , క్షత్రియ, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, మేదర, కుమ్మరి కులాల యువతీ యువకులు ఉపాధి కోసం రుణాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని గత నెలలో ప్రకటన వెలువడింది. ఈసారి కొత్తగా యూనిట్‌ విలువ నిర్ధారించలేదు. యూనిట్‌ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తారు. అలాగే కొత్తగా జనరిక్‌ షాపులకు అవకా శం కల్పించారు. ఉత్తరాంధ్ర ఎంఎల్‌సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఇవ్వడంతో కోడ్‌ కారణంగా దరఖాస్తు నమోదు ప్రక్రియ నిలిచింది. ఎన్నికల కోడ్‌ ఎత్తి వేయడంతో తిరిగి ఆన్‌లైన్‌లో నమోదు ప్రక్రియ ఈనెల 10వ తేదీ తరువాత మొదలైంది. ఈనెల 22వరకు గడువు ఇచ్చారు. కానీ ఆశించిన స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో ఈనెల 25 వరకూ గడువు పెంచారు. జిల్లా వ్యాప్తంగా 19,616 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇవి కూడా ఆశించిన స్థాయిలో లేవని అధికా రులు అంటున్నారు.

సామాజికవర్గాల వారీగా..

జిల్లాలోని బీసీ కులాలకు చెందిన వారు సెల్ఫ్‌ ఫెనాన్స్‌ యూనిట్ల్లకు 17, 478 దర ఖాస్తులు అందించారు. జనరిక్‌ షాపులకు 50, మేదరి, కుమ్మరి కులాల నుంచి 146 దరఖాస్తులు వచ్చాయి. వైశ్య కులానికి సం బంధించి సెల్ఫ్‌ ఫెనాన్స్‌కు 901, జనరిక్‌కు రెండు దరఖాస్తులు వచ్చాయి. బ్రాహ్మణులు 53 మంది, క్షత్రియలు 50 మంది దరఖాస్తు చేశారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి 8 మంది, కాపుల నుంచి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ యూనిట్లకు 675 మంది, జనరిక్‌ షాపులకు 21 మంది దరఖాస్తు చేశారు. ఈబీసీ నుంచి 43, కమ్మ సామాజిక వర్గం నుంచి 10 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే దరఖాస్తులు తక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని కులాల వారికి సెల్ఫ్‌ ఫెనాన్స్‌, జనరిక్‌ కలిపి రూ.71.33 కోట్లతో 3,379 యూనిట్లు లక్ష్యంగా నిర్ధారించారు.

Updated Date - Mar 29 , 2025 | 12:09 AM