ఘనంగా అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:00 AM
రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకను బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నిర్వహించారు.

అభినందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
జిల్లాలోనూ సేవా కార్యక్రమాలు
టెక్కలి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి బృందం): రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకను బుధవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, చీఫ్ సెక్రటరీ విజయానంద్, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆశీర్వదించగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు కేక్ తినిపించి, బొకేలిచ్చి అభినందించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సీఎం, మంత్రుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపు కోవడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ జన్మ దినం తనకు ప్రత్యేక సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తనను అభిమానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే విజయవాడలోని మంత్రి నివాసంలో కూడా భార్య విజయమాధవి, కుటుంబ సభ్యుల సమక్షంలో అచ్చెన్నాయుడు కేక్ కట్ చేశారు.
కోటబొమ్మాళిలో..
కోటబొమ్మాళి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 54వ జన్మదిన వేడుకలు బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు బోయి న రమేష్ ఆధ్వర్యంలో కొత్తమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అలాగే పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు హరివర ప్రసాద్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకు లు వెలమల కామేశ్వరరావు, తర్ర రామకృష్ణ, కల్లి నాగయ్యరెడ్డి, కల్లి లక్ష్మణరెడ్డి, దేవాది సింహాద్రి, నంబాళ్ల శ్రీనివాసరావు, కోరాడ గోవింద రావు, సాసుమంతు ఆనందరావు, కోట సంతోష్, కర్రి అప్పారావు తదిత రులు పాల్గొన్నారు.
గొల్లూరులో..
నందిగాం, మార్చి 26(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు మండలంలో బుధవారం నిర్వహిం చారు. గొల్లూరులో సర్పంచ్ జీరు రాజేశ్వరి నానీరెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులు, స్థానికులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఆర్గ్గ నైజింగ్ కార్యదర్శి పోలాకి చంద్ర శేఖరరావు పాల్గొన్నారు.