Share News

ఆర్థిక అసమానతలు తొలగించాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:09 AM

సమాజంలో ఆర్థిక అస మానతలు తొలగించడ మే లక్ష్యంగా ప్రతీ జన సేన కార్యకర్త కలిసి కట్టుగా పని చేయాలని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ పిలుపునిచ్చారు.

ఆర్థిక అసమానతలు తొలగించాలి
మాట్లాడుతున్న ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రమోహన్‌

శ్రీకాకుళం రూరల్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): సమాజంలో ఆర్థిక అస మానతలు తొలగించడ మే లక్ష్యంగా ప్రతీ జన సేన కార్యకర్త కలిసి కట్టుగా పని చేయాలని ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు రూరల్‌ మం డల పరిధిలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్‌ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో పార్టీ జెండాలు ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.పాపారావు, నాయకులు సత్తిబాబు, కూరాకుల యాదవ్‌, సంతోష్‌ పండా, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:09 AM