Share News

సేవలు ప్రజలకు మరింత చేరువకావాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:11 AM

పోలీ సు సేవలు ప్రజలకు మరింత చేరువ చే యాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి అన్నారు.

సేవలు ప్రజలకు మరింత చేరువకావాలి
పరిశీలిస్తున్న డీఐజీ గోపీనాథ్‌ జెట్టి

శ్రీకాకుళం క్రైం/ ఎచ్చెర్ల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పోలీ సు సేవలు ప్రజలకు మరింత చేరువ చే యాలని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ఎచ్చెర్ల ఆర్మ్డ్‌ రిజర్వ్‌ విభా గం, పోలీసు కార్యాలయం, డీసీఆర్బీ, స్పెషల్‌ బ్రాంచ్‌, పాస్‌పోర్టు విభాగాల ను సందర్శించి రికార్డులు నిర్వహణను పరిశీలించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా సాయుధ దళాల పనితీరు, ఆయుధా లు, రికార్డులు, మోటారు వాహనాల వినియోగం తదితర వాటిని పరిశీ లించారు. కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఏఎస్పీ కేవీ రమణ, ఏఆర్‌ డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, డీపీవో ఏవో గోపీనాఽథ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ిసీఐ ఇమ్మా న్యూల్‌రాజు, డీఎస్పీలు వివేకానంద, ఆర్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:11 AM