Share News

ఐదు దుకాణాలు, ఒక ఇల్లు సీజ్‌

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:07 AM

పన్ను బకాయి లు చెల్లించని వారిపై నగరపాలక సంస్థ అ ధికారులు కొరఢా ఝులిపించారు.

ఐదు దుకాణాలు, ఒక ఇల్లు సీజ్‌
చాపురంలో ఓ దుకాణానికి సీల్‌ వేస్తున్న దృశ్యం

శ్రీకాకుళం అర్బన్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): పన్ను బకాయి లు చెల్లించని వారిపై నగరపాలక సంస్థ అ ధికారులు కొరఢా ఝులిపించారు. కా ర్పొరేషన్‌ పరిధిలోని దుకాణాలు, ఇళ్ల స్థ లాలకు గాను గడి చిన కొన్నేళ్లుగా పన్ను బకాయిలు చెల్లించకపోవడంతో కమిషనర్‌ పీవీవీ ప్రసాదరావు ఆదేశాల మేరకు గురువారం ఆర్‌ఐ ఉమామ హేశ్వరరావు, రెవెన్యూ అధికారులు దుకాణాలతో పాటు, ఇంటికి తాళాలు వేసి సీజ్‌ చేశారు. చాపురం పంచాయతీలో నామానం బా సుకి చెందిన దుకాణం ఐదేళ్లకు గాను రూ.4.50 లక్షలు, నగరంలోని దండివీధిలోని ఓ మెకానిక్‌ షాపునకు ఐదేళ్లకు లక్ష రూపాయలు, కొన్నావీధిలో ఓ ఇంటికి ఏడేళ్లకు రూ.60 వేలు, చిత్రంజన్‌వీధిలోని ఎన్నేటి కృష్ణారావుకి చెందిన దుకాణానికి రూ.3.15 లక్షలు, మరో రెండు దుకాణాలు పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయితే పన్ను బకాయిలు చెల్లించమని నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించక పోవడంతో ఆర్‌ఐ ఉమామహేశ్వరరావు రెవెన్యూ సిబ్బందితో కలిసి బకాయి చెల్లించని దుకాణాలకు, ఓ ఇంటికి తాళాలు వేసి సీజ్‌ చేశారు. ఈ మేరకు కమిషనర్‌ పీవీవీ ప్రసాదరావు మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా పన్ను బకాయిలు చెల్లించని వారికి నోటీసులిచ్చా మని స్పందించకపోవడంతో సీజ్‌ చేశామన్నారు. ఈ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

Updated Date - Mar 21 , 2025 | 12:07 AM