Share News

1oth: ముగిసిన పదోతరగతి పరీక్షలు

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:58 PM

10th Grade Exams పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిసాయి. చివరి రోజు సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్‌కు సంబంధించి 28,276 మంది విద్యార్థులకు గాను 28,147 మంది హాజరయ్యారు.

1oth: ముగిసిన పదోతరగతి పరీక్షలు
శ్రీకాకుళం : ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థుల సందడి

  • చివరిరోజు 28,254 మంది హాజరు

  • తీపి జ్ఞాపకాలు పంచుకున్న విద్యార్థులు

  • గుజరాతీపేట, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షలు మంగళవారంతో ప్రశాంతంగా ముగిసాయి. చివరి రోజు సాంఘికశాస్త్రం పరీక్ష నిర్వహించారు. రెగ్యులర్‌కు సంబంధించి 28,276 మంది విద్యార్థులకు గాను 28,147 మంది హాజరయ్యారు. 129 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేటుకు సంబంఽధించి 129 మంది విద్యార్థులకుగాను 107 మంది హాజరు కాగా, 22 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 28,254 మంది పరీక్ష రాశారు. మధ్యాహ్నం 12.45 గంటలకు పరీక్ష ముగియగానే.. కేంద్రాల నుంచి విద్యార్థులు ఉల్లాసంగా బయటకొచ్చారు. తోటి విద్యార్థులతో తీపిజ్ఞాపకాలు పంచుకుంటూ.. వీడ్కోలు చెప్పుకున్నారు. హాస్టల్‌ విద్యార్థులు ఇంటిబాట పట్టారు.

Updated Date - Apr 01 , 2025 | 11:58 PM