కొత్త పెన్షన్ బిల్లును ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:57 PM
ఏకపక్షంగా తీసుకువస్తున్న కొత్త పెన్షన్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు వెంకటరావు పాణిగ్రాహి, ప్రసాదరావు డిమాండ్ చేశారు.

అరసవల్లి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ఏకపక్షంగా తీసుకువస్తున్న కొత్త పెన్షన్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు వెంకటరావు పాణిగ్రాహి, ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా స్థానిక పోస్టల్ కార్యాలయం వద్ద గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇటీవల కేంద్రం పార్లమెంట్ సభ్యుల పారితోషికాలను ఎటువంటి చర్చలు జరపకుండా పెంచారని, 35 నుంచి 40 ఏళ్ల పాటు ప్రజలను అనేక సేవలందించిన పెన్షనర్లకు మా త్రం పెన్షన్ రివిజన్స్ ఎగనామం పెట్టడానికి బిల్లును ఆమోదించడం అన్యాయమన్నారు. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించాలని, లేకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెన్షన్ పెంపుదల అనేది భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్-14’లోని ఆదేశాలని, వాటిని ఇప్పుడు ఉల్లంఘించడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఈ ధర్నాలో నాయకులు ఎం.పాపారావు, మన్మధరావు, ఎంవీ రామారావు, పాణిగ్రాహి, ఎం.గోవర్థనరావు, కె.గోపాలరావు, హెచ్.ఢిల్లేశ్వరరావు, పి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.