బీటీ రోడ్ల నిర్మాణం ప్రభుత్వ ధ్యేయం: బగ్గు
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:27 AM
గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రహదారుల నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి అన్నారు.

పోలాకి, మార్చి 30(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రహదారుల నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి అన్నారు. ఆదివారం కుసుమపోలవలస పంచాయతీ చీడివలస గ్రామాన్ని కలుపుతూ నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కుసుమపోలవలస నుంచి సుమారు 10 గ్రామాలను కలుపుతూ మూడు కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కార్యక్ర మంలో డోల జగన్, బైరి బాస్కరరావు, డోల ప్రసాదరావు, ఎంవీనాయుడు సర్పంచ్ తర్ర లక్ష్మీనారాయణ, ఎంపీడీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
నరసన్నపేట, మార్చి 30(ఆంధ్రజ్యోతి): క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. వైఎంసీఏ ఆధ్వర్యంలో వైపీఎల్ -8 క్రికెట్ పోటీలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు పేరు మీద పోటీలు నిర్వహిం చడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు, నియోజవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, టీడీపీ నాయకులు, పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు.