నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేకే విమర్శలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:39 PM
కూటమి ప్రభుత్వ హ యాంలో ఎచ్చెర్ల నియోజకవర్గం అభివృద్ధి చూసి మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కు మార్ ఓర్వలేక తమ నాయకుడు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూటమి నాయకులు ముప్పుడు సురేష్, బెండు మల్లేశ్వరరావు, రవి, పిషిని జగన్నాఽథంనాయుడు అన్నారు.

రణస్థలం, మార్చి 27(ఆంధ్ర జ్యోతి): కూటమి ప్రభుత్వ హ యాంలో ఎచ్చెర్ల నియోజకవర్గం అభివృద్ధి చూసి మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కు మార్ ఓర్వలేక తమ నాయకుడు ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కూటమి నాయకులు ముప్పుడు సురేష్, బెండు మల్లేశ్వరరావు, రవి, పిషిని జగన్నాఽథంనాయుడు అన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆటవిడుపుగా ఎన్‌ఈఆర్ 11వ నెంబరు అంటూ స్కిట్ చేశారని, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా చేయ లేదన్నారు. కార్యక్రమంలో కూటమి నేతలు డీజీఎం ఆనందరావు, లుకలాపు అప్పలనాయుడు, పిన్నింటి మధు, గొర్లె సాయి తదితరులు పాల్గొన్నారు.