traditions పిల్లలకు సంప్రదాయాలను తెలియజేయండి
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:56 PM
traditions తెలుగింటి సంప్రదాయ పండగల ప్రాముఖ్యత ను పిల్లలకు తెలియజేయాలని సినీనటి కవిత అన్నారు.

సినీనటి కవిత
వజ్రపుకొత్తూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): తెలుగింటి సంప్రదాయ పండగల ప్రాముఖ్యత ను పిల్లలకు తెలియజేయాలని సినీనటి కవిత అన్నారు. ఒంకులూరులో శుక్రవారం గ్రామా నికి చెందిన ఎన్‌ఆర్‌ఐ గుంటు వేణుగోపాల్ ఆధ్వర్యంలో ముందస్తు ఉగాది వేడుకలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. పలాస ప్రాంతంతో తనకు ప్రత్యేక అను బంధం ఉందన్నారు. టీడీపీ ప్రచారంలో గౌతు శివాజీ తరఫున ప్రచారం చేశానన్నారు. వేణు గోపాల్ పుట్టి పెరిగిన ఒంకులూరు గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుండడం అభినందనీయమన్నారు. తాను 45 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నానని, ఇప్పటికీ తెలుగు ప్రజలు తనను గుర్తించి అభిమానిస్తు న్నారన్నారు. ప్రస్తుతం పరిశ్రమకు వస్తున్న సినీ హీరోయిన్స్ నాలుగైదు ఏళ్ల తరువాత కనిపించడం లేదన్నారు. ఈ సందర్భంగా హైస్కూల్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజే శారు. గ్రామంలో ఉపాధ్యాయులకు, గ్రామ స్థాయి అధికారులకు బహుమతులు అందిం చారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు భాను ప్రకాశ్, జోగి అప్పారావు, లండ శ్రీధర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.