Minister Sandhya Rani: కూటమి ప్రభుత్వ లక్ష్యమిదే.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:55 PM
Minister Sandhya Rani: గిరిజన గ్రామాల్లో గిరిజన ప్రజల కోసం రోడ్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపనలు చేసిన అనతి కాలంలోనే ప్రారంభోత్సవాలు చేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పారు.
అమరావతి: మౌలిక సదుపాయాలు కల్పనలో విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రోడ్లు అభివృద్ధి చేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 100 రోజుల్లో 100 రోడ్లు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నామని అన్నారు. 6 నెలల్లో సీసీ, బీటీ రోడ్లు, పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. సాలూరు నియోజకవర్గంలో ఆగస్టులో గ్రామసభలు, అక్టోబరులో పల్లె పండగలు ఘనంగా చేసి, అందరి ఆమోదంతో ప్రతిపాదించుకున్న రోడ్లను 100 రోజుల్లో పూర్తి చేసి ప్రారంభం చేస్తున్నామని అన్నారు. జనవరి 6వ తేదీన ఒకేసారి 100 రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిపారు.
ఈ 100 రోడ్ల ప్రారంభోత్సవం సందర్భంగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు మంత్రి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. గిరిజన గ్రామాల్లో గిరిజన ప్రజల కోసం రోడ్లు నిర్మించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపనలు చేసిన అనతి కాలంలోనే ప్రారంభోత్సవాలు చేసి అభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో అభివృద్ధి, సంక్షేమం అనేది ఎంత చక్కగా జరుగుతుందో మనందరికీ తెలుసునని గుర్తుచేశారు. గత ఐదు సంవత్సరాలుగా జగన్ హయాంలో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ముఖ్యంగా పల్లెల్లో వెలుగులు నింపడానికి రహదారి సౌకర్యం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
పల్నాడు జిల్లా: జల్ జీవన్ మిషన్‌లో భాగంగా గ్రామంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తామని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేట మండలం బొప్పూడిలో ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. గ్రామస్తుల సమస్యలను అడిగి ఎంపీ, ఎమ్మెల్యే తెలుసుకున్నారు. బొప్పూడి గ్రామాభివృద్ధిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం నారా చంద్రబాబు నాయడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు స్వయంగా చూశారని అన్నారు. బైపాస్ నిర్మాణానికి భూములిచ్చిన ప్రతి రైతుకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
వ్యవసాయం చేసిన తనకంటే బాగా రైతుల కష్టాలు ఎవరికి తెలుస్తాయని చెప్పారు. రహదారుల నిర్మాణంతో పాటు, అభివృద్ధి పనులకు భూములిచ్చే రైతులకు న్యాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడూ ముందుంటాయని అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామస్తులు, నాయకులు ఒకటైతేనే గ్రామాలతో పాటు రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. గత పాలకుల్లా తాము ఓట్లు వేయించుకున్నాక ఇంట్లో కూర్చునే వాళ్లం కాదని చెప్పారు. ఎంపీ కృష్ణదేవరాయలు, తాను ఇద్దరం రైతుల పక్షమేనని ఉద్ఘాటించారు. చిలకలూరిపేట బైపాస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని తీసుకు వచ్చేందుకు ఎంపీ ప్రయత్నిస్తున్నారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు .
ఈ వార్తలు కూడా చదవండి
Purandeswari : దేవాలయాలపై దాడులు పెరిగాయి
Sankharavam: శంఖారావం సభలో పాల్గొననున్న వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు..
Renu Desai: తెలుగు సినిమా పరిశ్రమపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
Minister Lokesh: గాడి తప్పిన పాలనను సరిచేస్తున్నాం: మంత్రి నారా లోకేష్
Read Latest AP News and Telugu News