Share News

వైభవంగా సీతారాముల కల్యాణం

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:42 PM

వసంతోత్సవాల్లో భాగంగా బుధవారం దూకలపాడులో జ్యోతి రామలింగేశ్వర స్వామి ఆలయం, కొత్తబస్టాండ్‌లోని శ్రీరామమందిరంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా సీతారాముల కల్యాణం
ఎల్‌ఎన్‌పేట: పందిరిరాట వేస్తున్న భక్తులు

నరసన్నపేట,ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): వసంతోత్సవాల్లో భాగంగా బుధవారం దూకలపాడులో జ్యోతి రామలింగేశ్వర స్వామి ఆలయం, కొత్తబస్టాండ్‌లోని శ్రీరామమందిరంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహిం చారు. ఆయా గ్రామస్థులు పెద్ద ఎత్తున కల్యాణంలో పాల్గొని తిలకించారు.
రావిచెంద్రిలో..
ఎల్‌.ఎన్‌.పేట, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి):
రావిచెంద్రి గ్రామంలో భువనేశ్వరి సహిత పరమేశ్వరుల కల్యాణోత్సవం పురోహితుడు బంకుపల్లి. మధుబాబు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త గాలాల వెంకట చిన్నప్పలనాయుడు దంపతులు ఆలయం వద్ద పందిరిరాట వేశారు. అనం తరం శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణోత్సవం చేపట్టారు. మధ్యాహ్నం భక్తు లకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పలువురు గ్రామస్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రేపటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు
కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):
చీపుర్లపాడు పంచాయతీ ఊడికల పాడు గ్రామంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు శ్రీరామనవమి ఉత్స వాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్త సనపల కరుణ్‌ కుమార్‌ తెలిపారు. తొలి రోజు ఉదయం స్వామి వారి తీరువీధి, గాయత్రీ మహాయజ్ఞం చేపడుతున్నా మన్నారు. శనివారం మహిళతో సామూహిక కుంకుమ పూజలు, ఆదివారం ఉదయం 9 గంటల నుంచి వేదపండితులు సుసరాపు చంద్రశేఖరశర్మ ఆధ్వ ర్యంలో సీతారామ కల్యాణాన్ని 15 మంది దంపతులతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకుని తరించాలని కోరారు.
మడపాం ఆధ్యాత్మిక కేంద్రంలో..
నరసన్నపేట, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి):
మడపాం ఆభయాంజనేయ స్వామి ఆధ్యాత్మిక కేంద్రంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు తీర్మానించారు. ఈ మేరకు బుధవారం రామభక్త హనుమాన్‌ సేవా సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అభయాంజనేయస్వామి మందిర వార్షికోత్సవం, శ్రీరామ నవరాత్రి ఉత్సవాల నిర్వ హణపై చర్చించా రు. కొత్తకార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షులుగా ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, బాడాన రాజశేఖర్‌, అధ్యక్షుడిగా తంగుడు జోగారావు, కార్యదర్శిగా పొట్నూరు నీలంలను ఎన్నుకున్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:42 PM