Share News

ప్రభుత్వ బడిలో చదివించండి

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:37 PM

22

   ప్రభుత్వ బడిలో చదివించండి
కొత్తపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు:

కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధిస్తుం డడంతోపాటు ఫీజుల ఒత్తిడి ఉండదని, నాణ్యమైన భోజనంతోపాటు అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించాలని ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ఈ మేరకు గురువారం మండలంలోని కొత్తపల్లిలో స్థానిక జడ్పీ పాఠశాల హెచ్‌ఎం గోవిందరావు, ఉపాధ్యాయులు షణ్ముఖరావు తదితరులు విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.

Updated Date - Apr 03 , 2025 | 11:37 PM