Worker dies అనుమానాస్పద స్థితిలో కార్మికుడి మృతి
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:29 AM
Worker dies మండల కేంద్రానికి సమీపంలోని ఒక పరిశ్రమలో పని చేస్తున్న ఓ కార్మికుడు ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

రణస్థలం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి సమీపంలోని ఒక పరిశ్రమలో పని చేస్తున్న ఓ కార్మికుడు ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల మేరకు.. జేఆర్ పురం పరిధిలోని జీఎంఆర్ కాలనీకి చెందిన పిన్నింటి అప్పలసూరి(47) ఆ పరిశ్రమలో మిషన్ ఆపరేటర్‌గా విధులు నిర్వ హిస్తున్నాడు. ఆదివారం విధులకు వచ్చిన ఆయన పరిశ్రమలోని బాత్ రూమ్‌లో ప్లాస్టిక్ ప్యాకేజీ రూప్‌తో ఉరివేసుకుని మృతి చెందాడు. అప్పల సూరికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.
వేధింపుల వల్లే..
అప్పలసూరి మృతి విషయం తెలుసు కున్న కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి పరిశ్రమ వద్దకు చేరుకుని ఆందో ళన చేశారు. అతడి భార్య అమ్ములు మా ట్లాడుతూ.. పరిశ్రమ అధికారుల వేధిం పుల వల్లే తన భర్త ఈ అఘాయిత్యా నికి పాల్పడ్డాడని ఆరోపించింది. తమ కుటుంబానికి న్యాయం చేయాలం టూ భీష్మించి కూర్చుంది. ఈ ఘటనపై పోలీ సుల నుంచి వివరాలు తెలుసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా.. వారు స్పందించలేదు.
రెండు ఇళ్లలో చోరీ
ఎచ్చెర్ల, మార్చి 30(ఆంధ్రజ్యోతి): ధర్మవరం గ్రామంలో శనివారం అర్ధ రాత్రి రెండు ఇళ్లలో చోరీ జరిగింది. గ్రామంలో చింతు సత్యం, లక్ష్మణరావు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 16వ తేదీన తీర్థయాత్రలకు వెళ్లా రు. ఇంటికి తాళం వేడాన్ని గమనించిన దొంగలు తాళాలను పగులగొట్టి ఇం ట్లోకి ప్రవేశించారు. బీరువాలో భద్రపరిచిన బంగారు నగలును దొంగిలిం చారు. సత్యంకు చెందిన 7.5 తులాలు, లక్ష్మణరావుకు చెందిన రెండు తులా ల బంగారు ఆభరణాలు అపహరించారు. తీర్థయాత్రల్లో ఉన్న సత్యం, లక్ష్మణ రావులకు గ్రామంలోని బంధువులు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్ పరిశీలించి, ఆధారాలు సేకరించింది.
బంగారం గొలుసు అపహరణ
కంచిలి, మార్చి 30(ఆంఽధ్రజ్యోతి): అమ్మవారిపుట్టుగ గ్రామంలోని ఓ వృద్ధురాలి మెడలో నుంచి నాలుగు తులాల బంగారం గొలుసును అపహరించారు. కంచిలి పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. గ్రామానికి చెందిన బొడ్డ అమ్ముడమ్మ (అమ్మాయమ్మ) ఇంటి వెనుక గదిలో నిద్రిస్తుండగా.. శనివారం అర్ధరాత్రి 1.30గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి పెరటి నుంచి ప్రవేశించి, ఆమె మెడలోని సుమారు నాలుగు తులాల బంగారం పుస్తెలతాడు చోరీ చేసినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు.