Share News

Andhra Pradesh: 7,378 కిలోల గంజాయి నిర్వీర్యం’

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:14 AM

ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పోలీసులు 226 కేసుల్లో 7,378 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. ఈ గంజాయి నిల్వలను శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాతకుంకాం గ్రామంలోని రైన్‌ బో ఇండస్ట్రీ వద్ద గురువారం డీఐజీ పర్యవేక్షణలో ముగ్గురు ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్‌ జిందాల్‌, ఎస్‌వీ మాధవరెడ్డి సమక్షంలో నిర్వీర్యం చేశారు.

Andhra Pradesh: 7,378 కిలోల గంజాయి నిర్వీర్యం’

3 జిల్లాల్లో 226 కేసుల్లో సీజ్‌ చేసిన పోలీసులు

మూలాలు గుర్తించి బాధ్యులపై చర్యలు

విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి

లావేరు, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ‘గంజాయి సమూల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాం. మాదక ద్రవ్యాలతో సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తాం’ అని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి హెచ్చరించారు. ఇటీవల శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పోలీసులు 226 కేసుల్లో 7,378 కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. ఈ గంజాయి నిల్వలను శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాతకుంకాం గ్రామంలోని రైన్‌ బో ఇండస్ట్రీ వద్ద గురువారం డీఐజీ పర్యవేక్షణలో ముగ్గురు ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్‌ జిందాల్‌, ఎస్‌వీ మాధవరెడ్డి సమక్షంలో నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. ‘విశాఖ రేంజ్‌ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, వాటి మూలాలను గుర్తించి, బాధ్యులపై కేసులు నమోదు చేశాం. అనకాపల్లి జిల్లాలో ఈ ఏడాది జనవరిలో 34,419 కిలోల గంజాయి, 39.4 లీటర్ల హాషిష్‌ ఆయిల్‌ను నిర్వీర్యం చేశాం. రెండో దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత నెల 3,075 కిలోల గంజాయిని, 25.5 లీటర్ల హాషిష్‌ ఆయిల్‌ను నిర్వీర్యం చేశాం. మూడో దశలో గురువారం శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. గడచిన 8 నెలల్లో గంజాయి పూర్తిస్థాయి నిర్మూలనలో భాగంగా 524 కేసుల్లో 31,768 కిలోల గంజాయిని, 120.5 లీటర్ల హాషిష్‌, 372 వాహనాలను సీజ్‌చేసి 2,050 మంది నిందితులను అరెస్ట్‌ చేశాం. ఇందులో 575 మంది అంతరాష్ట్ర నిందితులు ఉన్నారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో విజయనగరం, అనకాపల్లి జిల్లాలో ఆస్తులు జప్తుచేశాం. రేంజ్‌ పరిధిలో గంజాయి వినియోగిస్తూ పట్టుబడిన 86 మందిని డి-అడిక్షన్‌ కేంద్రాలకు పంపించి కౌన్సెలింగ్‌ ఇచ్చాం’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి..

Shocking Video: నాదే తప్పు అయితే.. ఇక్కడి నుంచి వెళ్లిపోతా.. బస్సు డ్రైవర్ ఏం చేశాడో చూస్తే నివ్వెరపోవడం ఖాయం..

Viral Video: వీళ్లను ఎవ్వరూ కాపాడలేరు.. ఓ యువతి రైల్వే స్టేషన్‌లో అందరి ముందు ఏం చేసిందో చూడండి..

Updated Date - Mar 21 , 2025 | 05:14 AM