మురికివాడలు లేని రాష్ట్రంగా ఏపీ: మంత్రి నారాయణ
ABN , Publish Date - Mar 28 , 2025 | 03:18 AM
మంత్రి పి.నారాయణ "స్వర్ణాంధ్ర 2047" లక్ష్యంతో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అమరావతి నగర అభివృద్ధి, పట్టణాల ప్రణాళికలు, 2047 నాటికి రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు

విజయవాడ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని 2047 నాటికి మురికి వాడల రహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని మంత్రి పి.నారాయణ తెలిపారు. ‘స్వర్ణాంధ్ర 2047’పై స్థానిక స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్(స్పా)లో గురువారం జాతీయ స్థాయి సదస్సు నిర్వహించారు. ‘విజన్ 2047లోని పది సూత్రాల అమలుతో అన్ని రంగాల్లోను ముందంజలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. దేశం 100 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే సమయానికి రాష్ట్రాన్ని సమగ్ర, సమతుల్యమైన అభివృద్ధికి నమూనాగా రూపొందిస్తున్నాం. విజన్ 2047లో కీలక అంశం అమరావతి. కేంద్ర బడ్జెట్‌లో పట్టణాల అభివృద్ధికి నిధులు కేటాయించడంపై హర్షణీయం. ఈ నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం.’ అని మంత్రి కోరారు. కార్యక్రమంలో 20సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తదితరులు పాల్గొన్నారు.
For More AP News and Telugu News