ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:13 AM
గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారమే ప్రజా వేదిక లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు.

ఫ డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
బేతంచెర్ల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యల పరిష్కారమే ప్రజా వేదిక లక్ష్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రతి అర్జీ ని శ్రద్ధగా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసి తగిన చర్యలు తీసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హంద్రీ నీ వా కాలువ నీటితో గూటుపల్లె చెరువును నింపాలని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఏపీ రైతు సంఘం నాయకులు సభ్యులుల వినతి ప త్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వి.సుబ్బరా యుడు, పి.రామమోహన, కిస్టన్న, సి.శ్రీనివాసులు ఉన్నారు.
… బేతంచెర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ నాయకులు బుగ్గన ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంటును డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బుధవారం ప్రారంభిం చారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వెంకటేశ్వర్లు, స్వప్న రాణి ప్రియ, వైద్యసిబ్బంది, డోన ఆర్డీవో నరసింహులు, తహసీల్దార్ ప్ర కాష్‌బాబు, ఎంపీడీవో ఫజుల్ రెహిమాన, కమిషనర్ హరిప్రసాద్, టీడీపీ నాయకులు ఎల్లనాగయ్య, బుగ్గన ప్రసన్నలక్ష్మి, సోమశేఖర్ రెడ్డి, చంద్ర శేఖర్, తిరుమలేష్ చౌదరి, గౌరీ వెంకట్రామిరెడ్డి, బుగ్గన బ్రహ్మానందరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
… బేతంచెర్ల మండల కేంద్రంలో డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కార్యకర్తలతో బుధవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కార్యకర్తలతో మాట్లాడుతూ సమాలోచనలు జరిపి పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలను చర్చించారు. అలాగే స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ముస్లింలకు ఎమ్మెల్యే కోట్ల ఇఫ్తార్
డోన రూరల్: పట్టణంలోని సాయి ఫంక్షన హాలులో బుధవారం రాత్రి డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ముస్లింలకు ఇఫ్తార్ ఇచ్చారు. ఇఫ్తార్‌లో ఎమ్మెల్యే కోట్లసూర్యప్రకాష్ రెడ్డి, కూతురు కోట్ల నివేదితమ్మ పాల్గొని ముస్లింలకు భోజనం వడ్డించారు. కార్యక్రమంలో ఆర్డీవో నరసింహులు, పట్టణ సీఐ ఇంతియాజ్ బాషా, ఎక్సైజ్ స్టేషన సీఐ వరలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, ఓబులాపురం శేషిరెడ్డి, కమలాపురం సర్పంచ రేగటి అర్జున రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన కోట్రికే హరికిషణ్, మర్రి రమణ, ఓంప్రకాష్, ముస్లింలు పాల్గొన్నారు.