Share News

NTR district : ఐర్లాండ్‌లో ఇద్దరు ఏపీ విద్యార్థుల మృతి

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:36 AM

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన చిట్టూరి భార్గవ్‌ (25), పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్‌ (26) ఉన్నత చదువుల...

NTR district : ఐర్లాండ్‌లో ఇద్దరు ఏపీ విద్యార్థుల మృతి

  • కారు చెట్టును ఢీకొనడంతో ప్రమాదం

  • ఉన్నత చదువులకు వెళ్లిన భార్గవ్‌, సురేష్‌

జగ్గయ్యపేట/జగ్గయ్యపేటరూరల్‌/రొంపిచర్ల, జనవరి 31(ఆంధ్రజ్యోతి): ఐర్లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వివరాలివీ.. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన చిట్టూరి భార్గవ్‌ (25), పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేష్‌ (26) ఉన్నత చదువుల నిమిత్తం ఐర్లాండ్‌ వెళ్లారు. భార్గవ్‌ కార్లో పట్టణంలోని సౌత్‌ఈ్‌స్ట టెక్నొలాజికల్‌ యూనివర్సిటీలో చదువుతున్నాడు. సురేష్‌ ఎమ్మెస్‌ చేసేందుకు ఏడాది క్రితం వెళ్లాడు. వీరు శుక్రవారం స్నేహితులతో కలిసి కారులో వెళ్తూ ఓ చెట్టును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో భార్గవ్‌, సురేష్‌ ఇద్దరూ మృతి చెందినట్లు భార్గవ్‌ తండ్రి సాయిబాబుకు సమాచారం వచ్చింది. చెరుకూరి రామకోటయ్య, కుమారి దంపతులకు పెద్ద కుమారుడు సురేష్‌. ఐర్లాండ్‌లో విపరీతమైన మంచు కురుస్తుంటుందని, దీని వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.

Updated Date - Feb 01 , 2025 | 03:36 AM