కాగ్నిజెంట్ జీసీసీ సర్వీస్ గ్లోబల్ హెడ్‌గా శైలజ జోస్యుల
ABN , Publish Date - Apr 02 , 2025 | 04:22 AM
ప్రముఖ టెక్నాలజీ, ప్రొఫెషనల్ సేవల సంస్థ కాగ్నిజెంట్ తన జీసీసీ సర్వీస్ లైన్‌కి కొత్త గ్లోబల్ హెడ్‌ను నియమించింది. ఇప్పటికే కాగ్నిజెంట్‌లో..

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రముఖ టెక్నాలజీ, ప్రొఫెషనల్ సేవల సంస్థ కాగ్నిజెంట్ తన జీసీసీ సర్వీస్ లైన్‌కి కొత్త గ్లోబల్ హెడ్‌ను నియమించింది. ఇప్పటికే కాగ్నిజెంట్‌లో వివిధ ఉన్నత పదవులు నిర్వహించిన శైలజ జోస్యులను ఈ విభాగం గ్లోబల్ హెడ్‌గా నియమించినట్టు తెలిపింది. ఆమె ఈ హోదాలో హైదరాబాద్ నుంచి పని చేస్తారు. శైలజ తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో కాగ్నిజెంట్, ఈవై, థామ్సన్ రాయిటర్స్, హెచ్‌ఎ్‌సబీసీ వంటి పలు ప్రముఖ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Read More Business News and Latest Telugu News