Share News

అంతుచిక్కని వ్యాధితో పశువులు మృతి

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:12 PM

మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ చెరపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పశువులు, మేకలు మృతి చెందుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో మూడు పశువులు, తొమ్మిది మేకలు మృతి చెందాయి.

అంతుచిక్కని వ్యాధితో పశువులు మృతి
మృతి చెందిన పశువును పూడ్చిపెట్టేందుకు తీసుకు వెళుతున్న గిరిజనులు

చింతపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ చెరపల్లి గ్రామంలో అంతుచిక్కని వ్యాధితో పశువులు, మేకలు మృతి చెందుతున్నాయి. రెండు వారాల వ్యవధిలో మూడు పశువులు, తొమ్మిది మేకలు మృతి చెందాయి. ఆదివారం గ్రామస్థులు దేపూరం కూర్మారావు, అర్జున్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చెరపల్లిలో పది రోజుల క్రితం డొంకాడ చిన్నారావుకు చెందిన రెండు దుక్కిటెద్దులు మృతి చెందాయన్నారు. మూడు రోజుల వ్యవధిలో దేపూరం రాంబాబుకు చెందిన ఎద్దుతో పాటు తొమ్మిది మేకలు మరణించాయన్నారు. మరికొన్ని పశువులు, మేకలు వ్యాధులతో బాధపడుతున్నాయని, వెంటనే పశువైద్యశాఖ అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:12 PM