Share News

డ్రగ్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దు

ABN , Publish Date - Mar 23 , 2025 | 01:04 AM

డ్రగ్స్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి సూచించారు. బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో నగర పోలీసుల ఆధ్వర్యంలో నవ సమాజ నిర్మాణం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం ఉదయం నిర్వహించారు.

డ్రగ్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దు
మత్తు పదార్థాలకు బానిస కామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న సీపీ శంఖబ్రత బాగ్చి, తదితరులు

నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చీ

విశాఖపట్నం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత అప్రమత్తంగా ఉండాలని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి సూచించారు. బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో నగర పోలీసుల ఆధ్వర్యంలో నవ సమాజ నిర్మాణం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని శనివారం ఉదయం నిర్వహించారు. డ్రగ్స్‌ వల్ల జీవితాలు ఎలా పాడవుతాయి, యువత వీటికి దూరంగా ఉండడం వల్ల కలిగే మేలు వంటి అంశాలను ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీ మాట్లాడుతూ డ్రగ్స్‌ యువత జీవితాలను ఛిద్రం చేస్తాయన్నారు. డ్రగ్స్‌ వల్ల శరీరం, మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. అందువల్ల విద్యార్థులందరూ ఇటువంటి వాటికి దూరంగా ఉండాలన్నారు. ప్రస్తుతం సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ మాట్లాడుతూ విద్యావంతులు కూడా గత కొన్నాళ్లుగా సైబర్‌ నేరాలకు పాల్పడుతుండడం ఆందోళనకు గురి చేస్తోందన్నారు. పరిసరాల ప్రభావం కూడా విద్యార్థులు, యువతపై అధికంగా ఉంటుంది కాబట్టి డ్రగ్స్‌ వంటి వాటికి దూరంగా తమ పిల్లలు ఉండేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ జిందాల్‌, డీసీపీ-2 మేరీ ప్రశాంతి, క్రైమ్‌ ఏడీసీపీ మోహనరావు, ప్రొఫెసర్‌ హరనాథ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 01:04 AM