Share News

ఘనంగా మంత్రి అనిత జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Mar 25 , 2025 | 02:07 AM

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలను సోమవారం పాయకరావుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూటమి పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మంత్రి అనిత జన్మదిన వేడుకలు

శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు, ఎస్పీ, ఇతర అధికారులు

నక్కపల్లి/ఎస్‌.రాయవరం మార్చి 24 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత జన్మదిన వేడుకలను సోమవారం పాయకరావుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూటమి పార్టీల నాయకులు ఘనంగా నిర్వహించారు. నక్కపల్లి సమీపంలోని అనిత నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, కూటమి నాయకులు వచ్చి మంత్రి అనితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సింహాచలం, అన్నవరం, ఉపమాక ఆలయాల నుంచి వేదపండితులు వచ్చి ఆశీర్వచనం చేశారు. కాగా ఎస్‌.రాయవరం మండలం రేవుపోలవరం సముద్ర తీరంలో ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు నాలుగు మండలాల టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మంత్రి అనిత కేక్‌ కట్‌ చేశారు. రేవుపోలవరం గ్రామానికి చెందిన వాసపల్లి అడవిరాజు ఏర్పాటు చేసిన సైకత శిల్పాన్ని మంత్రి తిలకించి ఫొటోలు దిగారు.

Updated Date - Mar 25 , 2025 | 02:07 AM