Share News

టీచర్ల సమస్యలపై ఫ్యాప్టో నిరసన

ABN , Publish Date - Apr 02 , 2025 | 10:56 PM

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం(ఫ్యాప్టో)రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బుధవారం జిల్లా సంఘం నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.

టీచర్ల సమస్యలపై ఫ్యాప్టో నిరసన
కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

పాడేరురూరల్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం(ఫ్యాప్టో)రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు బుధవారం జిల్లా సంఘం నాయకులు ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌కు అందించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ రావుల జగన్మోహన్‌రావు, కార్యదర్శి వి.మహేశ్వరరావు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, అది ఆలస్యమైతే వెంటనే ఐఆర్‌ ప్రకటించాలని, పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని, కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా నాయకులు వల్లా వెంకటరమణ, జి.వికాస్‌, కె.ధనుర్జయ్‌, వివిధ సంఘాల జిల్లా, మండల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 10:56 PM