Share News

రోడ్ల కష్టాలకు తెర

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:34 AM

అడుగడుగునా రోడ్లపై గుంతలు. వాహనదారులు రాకపోకలు సాగించాలంటే నరకాన్ని చూడాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్కెక్కాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. ఇది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల దుస్థితి. ఐదేళ్ల పాలనలో ఒక్క ఏడాది కూడా రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం గోతులు అయినా పూడ్చకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రహదారులపై ప్రత్యేక దృష్టి సారించింది.

రోడ్ల కష్టాలకు తెర
రోలుగుంట మండలంలో నిర్మించిన బీటీ రోడ్డు

పాత రహదారులకు మరమ్మతులు, కొత్తగా సీసీ రోడ్ల నిర్మాణం

రూ.8.8 కోట్లతో 521.32 కి.మీ.ల ఆర్‌అండ్‌బీ రహదారులకు నూతన రూపు

రూ.181.22 కోట్ల ఉపాధి నిధులతో సీసీ/ బీటీ రోడ్లు

సుఖంగా ప్రయాణిస్తున్నామంటున్న ప్రజలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

అడుగడుగునా రోడ్లపై గుంతలు. వాహనదారులు రాకపోకలు సాగించాలంటే నరకాన్ని చూడాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్కెక్కాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి. ఇది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల దుస్థితి. ఐదేళ్ల పాలనలో ఒక్క ఏడాది కూడా రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం గోతులు అయినా పూడ్చకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రహదారులపై ప్రత్యేక దృష్టి సారించింది. తొలుత గుంతలు లేని రహదారుల కోసం నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 1,100 కిలో మీటర్ల పొడవున రోడ్లు ఉన్నాయి. తొలి దశలో 521.32 కిలోమీటర్ల పొడవుగల పలు రోడ్లకు మరమ్మతులకు రూ.8.8 కోట్లు విడుదలయ్యాయి. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఎక్కడా ఒక్క గొయ్యి లేకుండా మొత్తం కప్పేసిప్యాచ్‌ వర్క్‌ చేశారు. అవసరమైనచోట బీటీ లేయర్‌ వేశారు.

ఉపాధి నిధులతో సీసీ రోడ్లు

పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధి హామీ పథకం కన్వర్జెన్సీ నిధులతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి తొలి విడత (2024-25) రూ.181.22 కోట్లు మంజూరుయ్యాయి. వీటితో 229 కిలోమీటర్ల మేరసిమెంట్‌/ తారు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. వాస్తవంగా ఈ పనులన్నీ సంక్రాంతి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే డిసెంబరు వరకు వర్షాలు కురవడంతో పనులకు ఆటంకం కలిగింది. మొత్తం మీద మార్చి నెలాఖరునాటి కొత్త రహదారుల నిర్మాణ పనులన్నీ పూర్తిచేశారు.

మరో 20 రోడ్లకు రూ.51.8 కోట్లతో ప్రతిపాదనలు

జిల్లాలో రెండో దశలో మరో 20 రోడ్లకు నిధులు మంజూరు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. నాబార్డు స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌తో 181 కిలోమీటర్ల పొడవున బీటీ రోడ్ల నిర్మాణానికి అనుమతులు కోసం ఫైల్‌ పంపారు. పరిపాలన పరమైన ఆమోదం రాగానే ఆయా పనులకు టెండర్లు పిలిచి ఖరారు చేస్తామని ఆర్‌అండ్‌బీ ఈఈ అజయ్‌కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు.

Updated Date - Apr 03 , 2025 | 01:34 AM