Share News

వర్షాకాలంలో ఇసుక కొరత రానివ్వం

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:30 AM

వచ్చే వర్షాకాలంలో నగరంలో నిర్మాణ అవసరాలకు కొరత లేకుండా మూడు లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయనున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ భీమిలి, ముడసర్లోవ, గాజువాకల్లో ఉన్న ప్రైవేటు డిపోల్లో లక్ష టన్నుల వంతున అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించామన్నారు. వర్షాకాలంలో నదుల్లో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు వస్తాయని, అందువల్ల ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. శ్రీకాకుళం, రాజ మండ్రిల నుంచి ప్రస్తుతం జిల్లాకు రోజుకు మూడు వేల టన్నుల ఇసుక వస్తోందన్నారు. ప్రైవేటుగా నిర్మాణాల కోసం ఎవరికి వారు రీచ్‌లకు వెళ్లి ఇసుక తెచ్చుకుంటున్నారని, దీంతో ధరలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు.

వర్షాకాలంలో   ఇసుక కొరత  రానివ్వం

డిపోల్లో 3 లక్ష టన్నులు ముందే నిల్వ చేస్తాం

రూ.50 లక్షలతో రైతుబజార్లలో పనులు

త్వరలో ఎనిమిది గ్రామాల్లో భూముల రీసర్వే

జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి):

వచ్చే వర్షాకాలంలో నగరంలో నిర్మాణ అవసరాలకు కొరత లేకుండా మూడు లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయనున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ తెలిపారు. బుధవారం తన ఛాంబర్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ భీమిలి, ముడసర్లోవ, గాజువాకల్లో ఉన్న ప్రైవేటు డిపోల్లో లక్ష టన్నుల వంతున అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించామన్నారు. వర్షాకాలంలో నదుల్లో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు వస్తాయని, అందువల్ల ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. శ్రీకాకుళం, రాజ మండ్రిల నుంచి ప్రస్తుతం జిల్లాకు రోజుకు మూడు వేల టన్నుల ఇసుక వస్తోందన్నారు. ప్రైవేటుగా నిర్మాణాల కోసం ఎవరికి వారు రీచ్‌లకు వెళ్లి ఇసుక తెచ్చుకుంటున్నారని, దీంతో ధరలు అదుపులో ఉన్నాయని పేర్కొన్నారు.

నగరంలోని ఐదారు రైతుబజార్‌లలో మరుగుదొడ్లు, గేట్లు, ఫ్లోరింగ్‌, షెడ్లు మరమ్మతులకు రూ.50 లక్షలతో ప్రతిపాదనలు తయారుచేశామన్నారు. ఈ మేరకు మార్కెటింగ్‌ శాఖ ఇంజనీర్లకు ఆదేశాలు జారీచేశానన్నారు. కాగా త్వరలో నాలుగు గ్రామీణ మండలాల్లో మండలానికి రెండు వంతున ఎనిమిది గ్రామాల్లో భూముల రీసర్వే చేపడతామన్నారు. రీసర్వేపనులు పూర్తికి మూడు నెలల సమయం పడుతుందని, హడావిడి లేకుండా ప్రతి రైతుకు సమాచారం అందించి వారి సమక్షంలోనే రీసర్వే నిర్వహిస్తామన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:30 AM