Share News

నీటి చౌర్యానికి పాల్పడేవారిపై చర్యలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:09 AM

తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని బొబ్బిలి మునిసిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి తెలిపారు. గ్యాలరీవెల్స్‌కు నీటి నిల్వలు పెరిగేలా శాండ్‌బండ్స్‌ను ఏర్పాటు చేస్తామని, అక్రమంగా విద్యుత్‌ మోటార్లతో నీటిచౌర్యానికి పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నీటి చౌర్యానికి పాల్పడేవారిపై చర్యలు
వేగావతి నదిలో వాటర్‌వర్క్స్‌ను పరిశీలిస్తున్న కౌన్సిలర్లు, అధికారులు

బొబ్బిలి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని బొబ్బిలి మునిసిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి తెలిపారు. గ్యాలరీవెల్స్‌కు నీటి నిల్వలు పెరిగేలా శాండ్‌బండ్స్‌ను ఏర్పాటు చేస్తామని, అక్రమంగా విద్యుత్‌ మోటార్లతో నీటిచౌర్యానికి పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బుధవారం భోజరాజపురంలోని మునిసిపల్‌ ప్రధాన వాటర్‌వర్క్స్‌ను చైర్మన్‌ సావు వెంకటమురళీకృష్ణారావు, కమిషనర్‌తోపాటు వైస్‌చైర్మన్లు చెలికాని మురళీకృష్ణ, గొలగాని రమాదేవి, కౌన్సిలర్లు ఇంటి గోవిందరావు, పాలవలస ఉమాశంకర్‌, మరిపి తిరుపతిరావు, సవలాపురం రామకృష్ణ, కోఆప్షన్‌ సభ్యుడు రియాజ్‌ఖాన్‌ పరిశీ లించారు.టీడీపీ కౌన్సిలర్లతోపాటు ఇటీవల చైర్మన్‌ అవిశ్వాసం పెట్టేందుకు ముందుకొచ్చిన తొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు పరిశీలనకు గైర్హాజరయ్యారు. వేగావతి నదిలో నీటి లభ్యత, ఇన్‌ఫిల్ర్టేషన్‌ బావులను పరిశీలించారు. రోజువారీ నీటి పంపింగ్‌, లీకేజీలు తదితరసమస్యలను మునిపిపల్‌ డీఈఈ కిరణ్‌కుమార్‌, ఏఈ గుప్తలను అడిగి తెలుసుకున్నారు. వాట ర్‌వర్క్స్‌లోసమస్యలను ఫిట్టరు అప్పారావు అధికారులు, పాలక వర్గం సభ్యులకు వివరించారు. ఈ సందర్భంగా వైస్‌చైర్మన్‌ చెలికాని మురళీకృష్ణ,కౌన్సిలరు ఇంటి గోవిందరావు మాట్లాడు తూ కుళాయిలకు అక్రమంగా మోటార్లు పెట్టి నీటి చౌర్యానికి పాల్పడుతుండడంతో పట్టణ ప్రజలకు సక్రంగా నీటిని అందివ్వ లేకపోతు న్నామని తెలిపారు.డీఈ, ముగ్గురు ఏఈలు, సచివాల యం సిబ్బంది ఉన్నా తాగునీటిని సక్రమంగా అందివ్వలేకపో వడం, పర్యవేక్షణ చేయలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేయని అధికారులు,సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరా రు. తాగునీటిని విడిచిపెట్టే సమయంలో ఆయా ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తే అక్రమ విద్యుత్‌ మోటార్లు ఉన్నవారిని అరికట్టవచ్చని ఏఈలు సూచించారు.

Updated Date - Mar 20 , 2025 | 12:09 AM