BC Loan బీసీ రుణాల ఎంపికలో గోప్యత
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:32 PM
Confidentiality in BC Loan Selection బీసీ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో సీతంపేట మండల అధికారులు గోప్యత పాటిస్తున్నారు. వారి వివరాలు బయట పెట్టడం లేదు. కాగా నేడు అధికారికంగా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

సీతంపేట రూరల్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): బీసీ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో సీతంపేట మండల అధికారులు గోప్యత పాటిస్తున్నారు. వారి వివరాలు బయట పెట్టడం లేదు. కాగా నేడు అధికారికంగా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాస్తవంగా బీసీ రుణాల కోసం మండలంలో 181 దరఖాస్తులు వచ్చాయి. అయితే రూ.2, రూ.3, రూ.5 లక్షల యూనిట్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్న వివరాలను మాత్రం సంబంధిత అధికారులు వెల్లడించలేదు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిం చనుండగా.. దరఖాస్తుదారుల్లో అతి తక్కువ మందికి మాత్రమే బీసీ రుణాలు మంజూరైనట్టు తెలుస్తోంది. మరోవైపు లబ్ధిదారుల్లో కొందరికి మాత్రమే నేడు ఇంటర్వ్యూలు ఉన్నట్టుగా సమాచారం అందింది. దీంతో మరికొందరిలో ఆందోళన నెలకొంది. ఇంకొందరికి ఎంపిక ప్రక్రియ ఉందనే విషయం కూడా తెలియదు. దీనిపై ఏవో మాసను వివరణ కోరగా.. బీసీ రుణాల ప్రక్రియకు సంబంధించి 181 దరఖాస్తులు రావడం మాట వాస్తవమేనని తెలిపారు. నేడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శుల ద్వారా లబ్ధిదారులకు తెలియజేశామని తెలిపారు. అంతకుమించి తన వద్ద సమాచారం లేదన్నారు.