SA-2 Exams నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:22 PM
SA-2 Exams from 7th జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 7 నుంచి సమ్మెటివ్-2 పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు.

గరుగుబిల్లి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 7 నుంచి సమ్మెటివ్-2 పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1 నుంచి 5వ తరగతులకు ఈనెల 9 నుంచి , 6 నుంచి 9వ తరగతులకు 7 నుంచి 15వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జిల్లా పరిధిలోని 15 ఎమ్మార్సీ భవనాలకు ఎస్‌ఏ-2 పరీక్ష పత్రాలు చేరాయి. పాఠశాలల వారీగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా వాటిని విభజించారు. పరీక్ష సమయానికి గంట ముందుగా సంబంధిత ఉపాధ్యాయులు వాటిని పాఠశాలలకు చేరవేయాలి. ప్రాథమిక తరగతుల వారికైతే ఆయా స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు అందించాలి. ఆ తర్వాత ప్రశ్నపత్రాలను ఎమ్మార్సీలో భద్రపర్చాలి. జిల్లా పరిధిలో 1,749 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మొత్తంగా 1.16 లక్షల మంది సమ్మెటివ్-2 పరీక్షలకు హాజరు కానున్నారు. సమ్మెటివ్-2 పరీక్షల నిర్వహణకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని, నిబంధనల మేరకు నిర్వహిస్తామని గరుగుబిల్లి ఎంఈవో దత్తి అప్పలనాయుడు తెలిపారు. ఇప్పటికే పాఠశాలల హెచ్‌ఎంలకు సమాచారం అందించామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎండలు దృష్ట్యా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.