రూ. 200 కోట్లతో అభివృద్ధి పనులు
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:00 AM
ప్రతి గ్రామానికి రహదారి నిర్మించి, డోలీ మోతలు లేకుండా చేయడమే ప్రభుత్వం ధ్యేయమని స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.

పాచిపెంట, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామానికి రహదారి నిర్మించి, డోలీ మోతలు లేకుండా చేయడమే ప్రభుత్వం ధ్యేయమని స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు నియోజకవర్గంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో రూ. 200 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. బుధవారం మండలంలోని కొండమోసూరు జంక్షన్ నుంచి కోదవలస వరకు ఉపాధి హామీ పథకం కింద రూ. 1,25 కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్డును ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 940 అంగన్‌వాడీ పోస్టులకు గాను జిల్లాలో 53 పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. గిరిజన గ్రామాల్లో 250 మంది నివాసమున్న చోట ఒక డీలర్‌ను నియమించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలకు గిరిజనుల నుంచి వీఆర్వోలు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, విచారణ నిర్వహించి రుజువైతే అటువంటి వారిని సస్పెండ్ చేయాలని తహసీల్దార్ డి.రవికి ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖి సూర్యనారాయణ, గూడేపు యుగంధర్, నాయకులు పూసర్ల నరసింగరావు, చల్లా కనకబాబు, కొత్తల పోలినాయుడు, పల్లేడ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
మండలంలోని గురువునాయుడుపేటలో బుధవారం మహిళలు తాగునీటి కోసం సీపీఎం నాయకులు కోరాడ ఈశ్వ రరావు ఆఽధఽ్వర్యంలో నిరసన తెలిపారు. ఆ సమయంలో అటుగా వెళ్లిన మంత్రి గుమ్మడి సంధ్యారాణికి తమ సమస్యను వివరిం చారు. దీంతో తాగునీటి సమస్య ఎక్కడా ఉండకూడదని, అవస రమైతే బోరు తీయించి ట్యాంకు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. సాగునీరు నిమిత్తం ఏజెన్సీ గ్రామాల్లో చెరువులు నిర్మించాలని గిరిజన నాయకులు వి నతిపత్రం అందజేశారు. అవసరమైన చోట చెరువుల నిర్మాణా నికి పరిశీలించాలని ఎంపీడీవో బీవీజే పాత్రోకి మంత్రి ఆదేశించారు.
ఫపార్వతీపురం, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): పాచిపెంట మండల టీడీపీ అధ్యక్షుడు పిన్నింటి ప్రసాద్‌బాబు విశాఖపట్నంలో చికిత్స పొందుతుండడంతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి బుధవారం అక్కడి వెళ్లి పరామర్శించారు. ఆమెతోపాటు ముఖి సూర్యనారాయణ, యుగంధర్, కనకబాబు, సత్యనారాయణ, సాంబ ఉన్నారు.