మౌలిక వసతులకు నిధులు
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:04 AM
నియోజకవర్గం పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.బుధవారం మండలంలోని వెంకంపేట పంచాయతీ పరిధి లోని టీడీపీకార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.

పార్వతీపురం రూరల్, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.బుధవారం మండలంలోని వెంకంపేట పంచాయతీ పరిధి లోని టీడీపీకార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భం గా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తమ ప్రాంతాల్లో ఉన్న సమస్యలతో పాటు పలువురు ఉపాధి తదితర సమస్యలపై వినతి ప త్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎటువంటి సమస్యలునైనా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించడమే తన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులతో మాట్లాడుతానని చెప్పారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వకాలంలో నియోజకవర్గంలో అభివృద్ధిపడకేసిందన్నారు.