కొండ శిఖర గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:18 AM
మారుమూల కొండ శిఖర గ్రామాల్లో గిరిఆరోగ్య కేంద్రాలు పేరుతో కంటైనర్‌తో తయారుచేసిన ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు కురు పాం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు.

గుమ్మలక్ష్మీపురం, మార్చి 26 (ఆం ధ్రజ్యోతి): మారుమూల కొండ శిఖర గ్రామాల్లో గిరిఆరోగ్య కేంద్రాలు పేరుతో కంటైనర్‌తో తయారుచేసిన ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు కురు పాం ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి తెలిపారు. బుధవారం మండలంలోని తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్దగోడ గిరిజన గ్రామంలో కంటైనర్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరి ఆరోగ్య కేంద్ర సేవ లను పరిసరాల గిరిజన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి భాస్కరరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో పద్మావతి, తాడికొండ పీహెచ్‌సీ వైద్యులు బుద్దేశ్వరరావు, ఎంపీడీవో సాల్మన్‌రాజు, టీడీపీ నా యకులు వెంపటాపు భారతి, కడ్రక కళావతి పాల్గొన్నారు.
ఫ కురుపాం రూరల్. 26 మార్చి(ఆంధ్రజ్యోతి):మొండెంఖల్ ఆసుపత్రి పరిధిలోని పోరండంగూడలో ప్రభుత్వవిప్ జగదీశ్వరి బుధవారం కంటైనర్ ఆసుపత్రిని ప్రారం భించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో భాస్కరరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్, టీడీపీ మండలాధ్యక్షుడు కలిశెట్టి కొండయ్య, రంజిత్‌కుమార్ నాయికో, మొండెంఖల్ వైద్యాధికారి ప్రజ్ఞ పాల్గొన్నారు.