Share News

ugadi కొత్తదనానికి నాంది.. ఉగాది

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:15 AM

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. కొత్తదనాన్ని తెచ్చేసింది. మామిడి తోరణాలతో ఇళ్లను అలంకరించి.. ముంగిళ్లను రంగవల్లులతో ముస్తాబు చేసి.. సంప్రదాయ వస్త్రధారణలో కనువిందు చేసేందుకు చిన్న.. పెద్ద సిద్ధమయ్యారు. షడ్రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడిని రుచి చూడనున్నారు.

ugadi కొత్తదనానికి నాంది.. ఉగాది

కొత్తదనానికి నాంది.. ఉగాది

తెలుగు సంవత్సరాది ఉగాది వచ్చేసింది. కొత్తదనాన్ని తెచ్చేసింది. మామిడి తోరణాలతో ఇళ్లను అలంకరించి.. ముంగిళ్లను రంగవల్లులతో ముస్తాబు చేసి.. సంప్రదాయ వస్త్రధారణలో కనువిందు చేసేందుకు చిన్న.. పెద్ద సిద్ధమయ్యారు. షడ్రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడిని రుచి చూడనున్నారు. పంచాంగ శ్రవణంతో తిథి, వార ఫలితాలు తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇదే రోజు ఇష్ట దైవాన్ని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. అన్నదాతలు ఏరువాకతో ఖరీఫ్‌ పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాదిని పురస్కరించుకుని విజయనగరంలోని ప్రధాన మార్కెట్‌ శనివారం కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే దినుసులు( బెల్లం, ఉప్పు, వేపపువ్వు, చింతపండు, మామిడికాయలు, మిరపకాయలు)ను అందరూ విరివిగా కొనుగోలు చేశారు. పూలు, కొబ్బరికాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

- విజయనగరం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర పండుగగా ఉగాది

ఉగాదిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని తలపెట్టింది. ఈ మేరకు ఆదివారం ఉదయం 8.30 గంటలకు అన్ని చోట్లా అధికారికంగా ఉగాది ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. విశ్వాససు నామ ఉగాది పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జరిగే వేడుకలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, కలెక్టర్‌ అంబేడ్కర్‌, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

- కలెక్టరేట్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

Updated Date - Mar 30 , 2025 | 12:15 AM