సీహెచ్‌ఈసీ గ్రూపును ప్రవేశపెట్టండి
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:07 AM
ఇంటర్‌లో 2025- 26 విద్యాసంవత్సరం నుంచి కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్( సీహెచ్‌ఈ సీ) గ్రూపును ప్రవేశపెట్టాలని అధ్యాపక సంఘ సభ్యులు టి.రవికుమార్, భాస్క రరావు తదితరులు కోరారు.

పార్వతీపురం టౌన్/బెలగాం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌లో 2025- 26 విద్యాసంవత్సరం నుంచి కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్( సీహెచ్‌ఈ సీ) గ్రూపును ప్రవేశపెట్టాలని అధ్యాపక సంఘ సభ్యులు టి.రవికుమార్, భాస్క రరావు తదితరులు కోరారు.ఈ మేరకు బుధవారం మన్యం జిల్లా డీఐ ఈవో మంజులా వీణను వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంబీఐపీసీ గ్రూపును ప్రవేశపెట్టిందని, ఆర్ట్స్ విద్యార్థుల కోసం సీహెచ్‌ఈసీ ప్రవేశపెట్టడం వల్ల పేద విద్యార్థులు ఇంటర్ తరువాత ఉన్నత విద్యకు వెళ్లేందుకు అవకాశంఉంటుందని తెలిపారు. కార్య క్రమంలో అధ్యాపక సంఘ సభ్యులు వాసుదేవరావు, మురళీధర్, శ్రీనివాసరావు, రమేష్, శంకరరావు, శివానంద్, గోవిందరావు పాల్గొన్నారు.