Share News

క్రమశిక్షణ, సన్మార్గానికి మారుపేరు రంజాన్‌

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:06 PM

క్రమశిక్షణకు, సన్మార్గానికి మారుపేరు పవిత్ర రంజాన్‌ మాసమని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు.

    క్రమశిక్షణ, సన్మార్గానికి మారుపేరు రంజాన్‌
ఇఫ్తార్‌ విందులో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

- ఇఫ్తార్‌ విందులో కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): క్రమశిక్షణకు, సన్మార్గానికి మారుపేరు పవిత్ర రంజాన్‌ మాసమని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. రంజాన్‌ను పురస్కరించుకుని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక లయన్స్‌ కల్యాణ మండపంలో ఇఫ్తార్‌ విందు కార్య క్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. జిల్లాలో ముస్లింలకు శ్మశాన వాటిక సమస్య ఉన్నట్టు మత పెద్దలు తమ దృష్టికి తీసుకొచ్చారని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.జాన్‌, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎండీ గయాజుద్దీన్‌, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీర్రాజు, ఉర్దూ లై బ్రేరియన్‌ కుదుష్‌, మతపెద్దలు, ఇమామ్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలి

జిల్లాలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఉగాది వేడుకల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. స్థానిక లయన్స్‌ కల్యాణ మండపం వేదికగా ఈ నెల 30న ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా మామిడి తోరణాలు, అరటిచెట్లతో అలంకరణలు ఉండాలన్నారు. వేదిక లోపల, వెలుపల ప్రభుత్వ చిహ్నంతో ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవాయిధ్యాలు, పంచాంగ శ్రవణం, వేద పండితుల ఆశ్వీరచనం, ఉగాది పచ్చడి, పులిహోరా వంటి ప్రసాదాల ఏర్పాట్లను దేవదాయశాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. వేదికపై శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, కవుల సమ్మేళనం వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కవులకు ఘనంగా సత్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో జేసీ శోభిక, జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎల్‌.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2025 | 11:06 PM