Share News

పాస్టర్‌ మృతిపై విచారణ నిర్వహించాలి

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:43 PM

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతిపై తక్షణమే విచారణ నిర్వహించాలని చర్చిల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదివారం బొబ్బిలి, ఆరికతోటలో ర్యాలీలు నిర్వహించారు.

 పాస్టర్‌ మృతిపై విచారణ నిర్వహించాలి
రామభద్రపురం: ర్యాలీ చేస్తున్న ఆరికతోట ఏడీఎం బాప్టిస్ట్‌చర్చి కాపరులు:

నిందితులను శిక్షించాలి ఫ బొబ్బిలి, ఆరికతోటలో ర్యాలీ

పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతిపై తక్షణమే విచారణ నిర్వహించాలని చర్చిల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదివారం బొబ్బిలి, ఆరికతోటలో ర్యాలీలు నిర్వహించారు.

బొబ్బిలి,మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ అనుమానా స్పద మృతి నేపథ్యంలో ఆదివారం బొబ్బిలిలో సెంటినరీ బాప్టిస్టు చర్చి ప్రతి నిధులు ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్‌ మృతి వెనుక ఉన్న మిస్టరీని వెలికి తీసి హత్య అని తేలితే నిందితులను శిక్షించాలని డిమాండ్‌చేశారు.

ఫ రామభద్రపురం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ మృతిపై ప్రభుత్వం చిత్తశుద్ధితో విచారణ జరిపించాలని ఆరికతోట ఏడీఎం బాప్టిస్ట్‌చర్చి కాపరుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ప్రెసిడెంట్‌ చంద్రశేఖర్‌, కార్యదర్శి జార్జి ఎబినేజర్‌లు మాట్లాడుతూ దైవ సేవకులపైన దాడులకుపాల్పడడం హేయమైన చర్యఅని,దేశంలో అందరూ సోదర సమానత్వంతో కలిసిమెలిసి ఉంటున్న తరుణంలో మైనా రిటీలపై హత్యలకు పాల్పడడం ప్రజాస్వామ్యవ్యవస్థను విచ్చినంచేయడమే నన్నారు.ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం విచారణ వేగవంతం చేసి పోస్టుమార్టం రిపోర్టు వెళ్లడించాలని సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో సంఘ పెద్దలు, మాజీ సర్పంచ్‌ పెంకి భీమయ్య, సున్నపు ఆదయ్య, చర్చి ఫాస్టర్‌ సురేష్‌కు మార్‌, రవికుమార్‌, బాబ్జీ, పెంకి శేఖర్‌బాబు, రేజేటి అప్పారావు, జయరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 11:43 PM