మరమ్మతులు లేక.. శిథిలావస్థకు చేరి
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:51 PM
బొబ్బిలి మండలంలోని గో పాలరాయుడిపేట దాటిన తర్వాత బొడ్డవలస వద్ద వెంగళరాయసాగర్ కాలువపై దశాబ్దాల కిందట నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. ప్రధానంగా ప్రభుత్వాలు మారుతున్నా నిర్వహణ, మరమ్మతులకు నోచు కోవడంతో వంతెన ప్రమాదకరంగా మారింది.

బొబ్బిలి రూరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మండలంలోని గో పాలరాయుడిపేట దాటిన తర్వాత బొడ్డవలస వద్ద వెంగళరాయసాగర్ కాలువపై దశాబ్దాల కిందట నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరింది. ప్రధానంగా ప్రభుత్వాలు మారుతున్నా నిర్వహణ, మరమ్మతులకు నోచు కోవడంతో వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా ఉన్న గోడలు బీటలు వారడంతోపాటు రెయిలింగ్ పూర్తిగా దెబ్బతింది. గోడలు పటుత్వం లేకపోవడంతో పెచ్చులు రాలిపోతున్నాయని పలువు రు వాపోతున్నారు. అలాగే వంతెన కింది భాగంలో శ్లాబు ఊడిపడిపో తోంది. గజాలు తుప్పుపట్టడంతోపాటు బయటకు కనిపిస్తున్నాయి. దీంతో వంతెన మీదుగా భారీ వాహనాలు వెళ్లే సమయంలో ఎటువంటి ప్రమా దాలు జరుగుతాయోనన్న భయాందోళన స్థానికుల్లో నెలకొంది. బొబ్బిలి, మక్కువ మండలాల్లోని బొడ్డవలస, వెలగవలస తదితర సుమారు 20 గ్రామాల ప్రజల ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. అంతే కాకుండా పంట పొలాల నుంచి తమ ఉత్పత్తులను ఇళ్లకు ఇక్కడి నుంచే చేరుస్తుంటారు. ఈ మార్గంలో రోజుకు 500 వరకు వాహనాలు వచ్చిపో తున్నాయి. వెంగళరాయసాగర్ జలాశయం నుంచి బొబ్బిలి, మక్కువ మండలాల్లోని వేలాది ఎకరాలకు ఈ మార్గం గుండానే సాగునీరందు తోంది. దీంతో ఖరీఫ్, రబీ సీజన్లలో ఏటా జలవనరులశాఖ అధికారులు కాలువల పరిశీలనకు ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. తొలి రోజుల్లో వెంగళరాయసాగర్ ఆయకట్టుకు సక్రమంగా నీరందించేం దుకు వీలుగా కాలువను పరిశీలించేందుకు అప్పట్లో నీటిపారుదల శాఖ అధికారులు ఇక్కడ వంతెన నిర్మించారు.తర్వాత కాలంలో పలు గ్రామాల ప్రజలకు వారధిగా మారింది. అయితే దశాబ్దాలు గడుస్తున్నా కనీస మర మ్మతులకు అధికారులు దృష్టి సారించడంలేదని పలువురు ఆరోపిస్తున్నా రు.కాగా వంతెనకు సంబంధించి ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరు కాగానే పనులు చేస్తామని నీటిపారుదలశాఖ బొబ్బిలి సర్కిల్ ఏఈ సుధీర్ తెలిపారు.