పర్యవేక్షణ లేక.. పిచ్చిమొక్కలు పెరిగి
ABN , Publish Date - Mar 30 , 2025 | 11:50 PM
సారధిగెడ్డపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఆక్రమణలు పుణ్యమాని కుదించుకుపోతోంది. దీంతో వర్షాకాలంలో వరదల సమయంలో పంటపొలాలు నీటముంపు నకు గురవుతున్నాయి. దీనికితోడు ఈ గెడ్డ పరిధిలో కాలువల్లో ఏళ్ల తర బడి పనులు చేపట్టకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో నీటిప్రవాహంసజావుగా జరగకపోవడంతో ఆయకట్టుకు నీరందడం లేదు.

రాజాం రూరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): సారధిగెడ్డపై అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఆక్రమణలు పుణ్యమాని కుదించుకుపోతోంది. దీంతో వర్షాకాలంలో వరదల సమయంలో పంటపొలాలు నీటముంపు నకు గురవుతున్నాయి. దీనికితోడు ఈ గెడ్డ పరిధిలో కాలువల్లో ఏళ్ల తర బడి పనులు చేపట్టకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో నీటిప్రవాహంసజావుగా జరగకపోవడంతో ఆయకట్టుకు నీరందడం లేదు.
ఇదీ పరిస్థితి
నాలుగుమండలాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు సారధిగెడ్డ ద్వారా సాగునీరందించాల్సిఉంది. గత పాలకుల నిర్లక్ష్యం, రైతు ల స్వార్ధం పుణ్యమాని అడుగడుగునా రైతులు ఆక్రమించడంతో గెడ్డ కుదించుకుపోతోంది. దీంతో ఏయేటికాయేడు గెడ్డ పరిధిలో సాగువిస్తీర్ణం తగ్గిపోతోంది. అన్నదాతను ఆదుకునే గెడ్డవైపు గత పాలకులు కన్నెత్తి చూడలేదు. దీంతో సుమారు 30 కిలోమీటర్ల మేర రెల్లిగెడ్డతోపాటు పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. వర్షాకాలంలో సైతం గెడ్డపొంగినా జలాలు ముందుకు సాగేందుకు వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి.
రెల్లిగెడ్డలో మిగులు జలాలు
తెర్లాం మండలంలోని మిగులు జలాలు రాజాం మండలంలోని పలు గ్రామాల చెరువులను గొలుసుకట్టు విధానం ద్వారా నింపుతూ సారధి గెడ్డలో చేరేలా బొబ్బిలిరాజుల హయాంలో రూపకల్పన చేశారు. దశా బ్దాలుగా సారధిగెడ్డకు ఆనుకునిఉన్న భూములను సస్యశ్యామలం చేస్తోం ది. శ్రీకాకుళం జిల్లాలోని జి.సిగడాం మండలంలో ప్రవహిస్తూ పొందూరు మండలంలోని రెల్లిగెడ్డలో మిగులునీరు చేరుతోంది. సుమారు 30 కిలో మీటర్ల మేర ప్రవహిస్తూ పంటపొలాలకు సాగునీరందించే సారధిగెడ్డ ప్రస్తుతం అధ్వానంగా మారింది.తెర్లాం మండలంలోని మొదలుకుని రాజాం, జి.సిగడాం, పొందూరు మండలాల పరిధిలో అవకాశమున్న చోట ల్లా చిన్న, సన్నకారు రైతులు గెడ్డలో ఆక్రమించి పొలాలుగా మార్చుకు న్నారు. దీంతో మిగులు జలాలు గెడ్డలోకి చేరే అవకాశం లేకుండాపోయిం ది. ఈనేపథ్యంలో శివారు ఆయకట్టుకు నీరు చేరే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. ఫలితంగా అన్నదాత ఆకాశం వైపు ఖరీఫ్‌లో సైతం ఏటా ఎదురుచూడాల్సి వస్తోంది.తక్షణమే సారధిగెడ్డలోని ఆక్రమణలు తొలగిం చి సాగునీరు నాలుగు మండలాల ఆయకట్టుకు అందేలా చర్యలు తీసుకో వాలని రైతులు కోరుతున్నారు.