Share News

కొఠియా కొండల్లో ముగిసిన షూటింగ్‌

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:04 AM

కొఠియా కొండల్లో ఎస్‌ఎస్‌ రాజ మౌళి దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న ఎస్‌ఎస్‌ ఎంబీ 29 వర్కింగ్‌ టైటిల్‌ సినిమా షూటింగ్‌ బుధవా రం ముగిసింది.

   కొఠియా కొండల్లో ముగిసిన షూటింగ్‌
మహేష్‌బాబుతో కోరాపుట్‌ ఎస్పీ, జయపురం సబ్‌కలెక్టర్‌, ఎస్డీపీవోలు:

సాలూరు రూరల్‌, మార్చి 19 (ఆంధ్రజ్యో తి):కొఠియా కొండల్లో ఎస్‌ఎస్‌ రాజ మౌళి దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న ఎస్‌ఎస్‌ ఎంబీ 29 వర్కింగ్‌ టైటిల్‌ సినిమా షూటింగ్‌ బుధవా రం ముగిసింది. ఇక్కడ తోలోమాలి ప్రాంతంలో ఈనెల ఆరోతేదీ నుంచి మహే ష్‌ బాబు,పృద్వీరాజ్‌, ప్రియాం కాచోప్రా తదితరులపై సన్నివేశాలను చిత్రీకరించారు. కోరాపుట్‌ ఎస్పీ రోహిత్‌వర్మ, జయపురం సబ్‌ కలెక్టర్‌ సస్య, ఎస్‌డీపీవో జగదీస్‌ కశ్యప్‌లను మహేష్‌బాబు కలిశారు. రాజమౌళిని ఒడిశా కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత రామచంద్ర కడెంతోపాటు పలువురు రాజకీయ నేతలను కలిశారు. పియాం కచోప్రా, రాజమౌళిలతో స్థానికులు సెల్ఫీలు దిగారు. కాగా షూటింగ్‌ ముగియడంతో పరిసరాలు శుభ్రంచేశారు.

Updated Date - Mar 20 , 2025 | 12:04 AM