Share News

Viral Hepatitis వైరల్‌ హెపటైటిస్‌తో అప్రమత్తం

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:51 PM

Stay Alert About Viral Hepatitis వైరల్‌ హెపటైటిస్‌పై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. కాలేయ వ్యాధి నియంత్రణకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను మంగళవారం తన ఆరోగ్య కార్యాలయంలో ఆవిష్కరించారు.

  Viral Hepatitis  వైరల్‌ హెపటైటిస్‌తో అప్రమత్తం
పోస్టర్లను విడుదల చేస్తున్న డీఎంహెచ్‌వో

పార్వతీపురం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): వైరల్‌ హెపటైటిస్‌పై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు సూచించారు. కాలేయ వ్యాధి నియంత్రణకు సంబంధించిన వాల్‌ పోస్టర్లను మంగళవారం తన ఆరోగ్య కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగ లక్షణాలు, నిర్ధారణ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించొచ్చని తెలిపారు. వైరల్‌ హెపటైటిస్‌ ప్రబలిన వారిలో త్వరగా అలిసిపోవడం, కడుపునొప్పి, ఆకలి లేకపోడం, వికారం, వాంతులు, చర్మం రంగుమారడం, కళ్లు పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. అవగాహన, అప్రమత్తతతో వైరల్‌ హెపటైటిస్‌కు దూరంగా ఉండొచ్చన్నారు. కాగా ప్రతిఒక్కరూ ఎప్పటికప్పుడు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గర్భిణులకు హెపటైటిస్‌-బీ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలందరికీ టీకా తప్పనిసరిగా వేయించాలన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు జగన్మోహన్‌రావు, వినోద్‌కుమార్‌, డీపీహెచ్‌ఎస్‌వో ఉషారాణి, డీపీవో లీలా, డెమో సన్యాసిరావు, డీఎస్‌వో శంకర్‌ తదితరులున్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:51 PM