Share News

ఆశీలు వేలం పాట ఖరారు

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:06 AM

మునిసిపల్‌ అధికారులు ఆశీలు వేలం పాటను ఖరారుచేశారు. ఈమేరకు బుధవారం స్థానిక మునిసిపల్‌ కార్యాల యంలో ఆశీలు వేలంపాటను ఇన్‌చార్జి కమిషనర్‌ బీవీ ప్రసాద్‌, మేనేజర్‌ బీఎం శివప్రసాద్‌తో అఽధికారులు నిర్వహించారు.

  ఆశీలు వేలం పాట ఖరారు
వేలంపాట నిర్వహిస్తున్న మునిసిపల్‌ అధికారులు :

సాలూరు,మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ అధికారులు ఆశీలు వేలం పాటను ఖరారుచేశారు. ఈమేరకు బుధవారం స్థానిక మునిసిపల్‌ కార్యాల యంలో ఆశీలు వేలంపాటను ఇన్‌చార్జి కమిషనర్‌ బీవీ ప్రసాద్‌, మేనేజర్‌ బీఎం శివప్రసాద్‌తో అఽధికారులు నిర్వహించారు.గతఏడాది నాలుగు లక్షల 45 వేలుకు పాడగా, ఈ ఏడాది నాలుగు లక్షల 70 వేలుగా సర్కారీ వారి పాటగా అధికారులు నిర్ణయించారు. దీంతో ఆరు లక్షలకు ఎం.భువనేశ్వరరావు ఆశీలు, కాగా కబేళాల నిర్వహణకు సంబందించి కె.నూకరాజు 66.600 రూపాయలకు దక్కించుకున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 12:06 AM