తోటపల్లి ఆధునికీకరణ పూర్తి చేయాలి
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:14 AM
తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు.

పాలకొండ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కోరారు. అసెంబ్లీలో గురువారం ఆయన మాట్లాడారు. నాగావళ నదిపై ఎడమ ప్రధాన కాలువ, కుడి ప్రధాన కాలువల ద్వారా 64వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి 1908లో తోటపల్లి రెగ్యులేటర్ నిర్మించారని చెప్పారు. 2018లో టీడీపీ ప్రభుత్వంలో తోటపల్లి కుడి, ఎడమ ప్రధాన కాలువల ఆధునికీకరణకు రూ.195.34 కోట్లు అంచనా విలువతో ఆధునికీకరణ పనిని మంజూరు చేశారని తెలిపారు. సదరు పని 23 శాతం జరిగిందని, మొత్తం రూ.41కోట్లు పని జరగగా, రూ.23కోట్లకు సంబంధించి బిల్లు విడుదల అయ్యిందని, రూ.18కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించాలని ఆయన కోరారు.